శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
ఓపెనర్లు విశ్మి గుణరత్నే 45, కెప్టెన్ ఆటపట్టు 43 పరుగులు మాత్రమే రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. జట్టు స్కోరులో 75 శాతం స్కోరు ఈ ఇద్దరిదే కావడం విశేషం. టీమిండియా మహిళల బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుక సింగ్, రాదా యాదవ్, పూజా వస్రాకర్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన 39 పరుగులు చేయగా.. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 31 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రంగా మారిన మూడో టి20 జూన్ 27న(సోమవారం) జరగనుంది.
చదవండి: Virat Kohli Tattoos: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment