మిథాలీ రాజ్(ఫైల్‌పొటో)
ఈస్ట్ లండన్(దక్షిణాఫ్రికా):దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను గెలవడంతో పాటు మొదటి టీ 20లో గెలిచిన భారత మహిళల జట్టు.. అదే ఊపును రెండో టీ 20ల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రేపటి మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యాన్ని పెంచుకోవడంపై భారత జట్టు దృష్టి సారించింది. శుక్రవారం ఈస్ట్ లండన్‌లో బఫెలో పార్క్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టీ 20 జరుగనుంది. రేపు సాయంత్రం 4.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానున్న మ్యాచ్‌లో సైతం గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించడానికి హర్మన్ ప్రీత్ కౌర్ సేన కసరత్తులు చేస్తోంది.
తొలి టీ 20లో దక్షిణాఫ్రికా విసిరిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు.మిథాలీ రాజ్(54 నాటౌట్), వేదా కృష్ణమూర్తి(37 నాటౌట్), స్మృతీ మంధన(28), రోడ్రిగ్యూస్(37)లు రాణించి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. ఇది భారత్ జట్టుకు అత్యధిక ఛేదన కావడం ఇక్కడ మరో విశేషం. దాంతో రెండో టీ20లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment