
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12–10, 9–11, 6–11, 11–8, 8–11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది.
47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్‌లో కీలక తరుణంలో మనిక తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో ఓడిన మనిక బత్రాకు 3,500 డాలర్ల (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment