భారత టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. పురుషులు, మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్‌లో (2024) పాల్గొనే సువర్ణావకాశం దక్కింది. తాజాగా (మార్చి) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌ను.. మహిళల జట్టు 13వ ర్యాంక్‌ను సాధించి ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి.
Indian Men's and Women's Table Tennis teams Qualifies for the Olympics for the first tym ever!
— Rambo (@monster_zero123) March 4, 2024
The TT March World Team Rankings are out. Men's Team remained at WR15 while Women's team made a jump to WR13.
This is Huge.
Historic Feat!#Paris2024#TableTennis https://t.co/MBqX417KQQ pic.twitter.com/zV4yhhWZUz
ఇటీవల ముగిసిన ITTF వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో భారత జట్లకు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ప్రపంచ ర్యాంకింగ్ కారణంగా ఒలింపిక్స్ బెర్తులు ఖరారు చేసుకోవడం విశేషం. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 16 స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment