Olympic berth
-
Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత
న్యూఢిల్లీ: మూడు క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా వీలుకాకపోయినా వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్న 10 జట్లను మినహాయించి... వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో భారత్, చైనా... మహిళల విభాగంలో భారత్, ఇండోనేసియా జట్లకు ఈ అవకాశం లభించింది. ఫలితంగా వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో, వ్యక్తిగత విభాగాల్లో, మిక్స్డ్ టీమ్ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్) పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 44 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్... మాజీ నంబర్‌వన్ దీపికా కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత పురుషుల ఆర్చరీ జట్టు: తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాధవ్. భారత మహిళల ఆర్చరీ జట్టు: దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత. -
రెజ్లింగ్‌లో భారత్‌కు ఐదో ఒలింపిక్ బెర్త్... 68 కేజీల విభాగంలో ఫైనల్లోకి నిషా
ఇస్తాంబుల్: ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి మహిళల విభాగంలో భారత్ నుంచి అత్యధికంగా ఐదుగురు బరిలోకి దిగనున్నారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియా ఫైనల్‌కు చేరుకొని భారత్‌కు ఐదో ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసింది. సెమీఫైనల్లో నిషా 8–4తో అలెగ్జాండ్రా ఎంగెల్ (రొమేనియా)పై గెలిచింది.తొలి రౌండ్లో ‘బై’ పొందిన నిషా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–0తో అలీనా షౌచుక్ (టరీ్క)పై, క్వార్టర్ ఫైనల్లో 7–4తో అడెలా హాంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్ మాన్సి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. నిషా కంటే ముందు అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. నేడు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ నుంచి ఆరుగురు రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు.. తొలిసారి ఒలింపిక్స్ అర్హత
భారత టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. పురుషులు, మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్‌లో (2024) పాల్గొనే సువర్ణావకాశం దక్కింది. తాజాగా (మార్చి) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌ను.. మహిళల జట్టు 13వ ర్యాంక్‌ను సాధించి ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి. Indian Men's and Women's Table Tennis teams Qualifies for the Olympics for the first tym ever! The TT March World Team Rankings are out. Men's Team remained at WR15 while Women's team made a jump to WR13. This is Huge. Historic Feat!#Paris2024#TableTennis https://t.co/MBqX417KQQ pic.twitter.com/zV4yhhWZUz — Rambo (@monster_zero123) March 4, 2024 ఇటీవల ముగిసిన ITTF వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో భారత జట్లకు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ప్రపంచ ర్యాంకింగ్ కారణంగా ఒలింపిక్స్ బెర్తులు ఖరారు చేసుకోవడం విశేషం. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 16 స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా.. నేడు పటిష్టమైన జర్మనీతో భారత్ 'ఢీ'
Women's Hockey Olympic Qualifiers: మరో మ్యాచ్ కోసం ఎదురు చూడకుండా... పటిష్టమైన జర్మనీపై గెలిచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ఉంది. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఈరోజు జర్మనీతో భారత్; అమెరికాతో జపాన్ తలపడనున్నాయి. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరిన రెండు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు మాత్రమే చివరిదైన మూడో బెర్త్ ఖరారవుతుంది. దాంతో భారత్‌తోపాటు మిగతా మూడు జట్లు కూడా సెమీఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. 2006 నుంచి జర్మనీతో ఏడుసార్లు తలపడ్డ భారత్ ఐదుసార్లు ఓడిపోయి, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో జర్మనీపై గెలవాలంటే భారత్ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఇషా డబుల్ ధమాకా
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్‌లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. -
ISSF World Championships: స్వప్నిల్ గురికి ‘పారిస్’ బెర్త్ ఖరారు
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ ద్వారా భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. ఈజిప్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శనివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలె నాలుగో స్థానంలో నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు షూటింగ్లో భారత్‌కు మూడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ట్రాప్ ఈవెంట్లో భౌనీష్ మెందిరత్త, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రుద్రాం„Š పాటిల్ పారిస్ విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. -
యశస్విని సింగ్ పసిడి గురి...
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్–234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా –215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు. -
షూటింగ్లో మరో ఒలింపిక్ బెర్త్
మ్యూనిక్: యువ షూటర్ మను భాకర్ భారత్‌కు ఏడో ఒలింపిక్స్ బెర్త్ కోటా తెచ్చిపెట్టింది. ప్రపంచకప్‌లో ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలువడంతో భారత్‌కు ఈ బెర్త్ ఖరారైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో ఇది వరకే సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ ఒలింపిక్స్ కోటా సాధించారు. -
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
లాస్ వెగాస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే ఈ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో తమ ఒలింపిక్ బెర్త్‌లను ఖాయం చేసుకునేందుకు భారత రెజ్లర్లు సిద్ధమవుతున్నారు. గాయంతో బాధపడుతున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఈ పోటీలకు దూరమవుతుండగా.. యోగేశ్వర్ దత్, నర్సింగ్ యాదవ్, అమిత్, మౌసమ్ తదితరులు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతున్నారు. పురుషుల 74కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడుతున్న 26 ఏళ్ల నర్సింగ్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ విభాగంలో సుశీల్ కుమార్ గాయంతో పాల్గొనకున్నా నర్సింగ్ పలు విజయాలు సాధించాడు. ప్రతీ కేటగిరీలో టాప్-6 స్థానాల్లో వచ్చిన వారు ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంటారు. లండన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ (65కేజీ ఫ్రీస్టయిల్ ), అమిత్ కుమార్ (57కేజీ), మౌసమ్ ఖత్రి (97కేజీ).. మహిళల ఫ్రీస్టయిల్లో వెటరన్ గీతా ఫోగట్, బబిత, వినేశ్‌లపై పతకంతో పాటు బెర్త్ ఆశలున్నాయి.