ఇస్తాంబుల్: ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి మహిళల విభాగంలో భారత్ నుంచి అత్యధికంగా ఐదుగురు బరిలోకి దిగనున్నారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియా ఫైనల్‌కు చేరుకొని భారత్‌కు ఐదో ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసింది. సెమీఫైనల్లో నిషా 8–4తో అలెగ్జాండ్రా ఎంగెల్ (రొమేనియా)పై గెలిచింది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన నిషా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–0తో అలీనా షౌచుక్ (టరీ్క)పై, క్వార్టర్ ఫైనల్లో 7–4తో అడెలా హాంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్ మాన్సి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.
నిషా కంటే ముందు అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. నేడు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ నుంచి ఆరుగురు రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment