క్వార్టర్స్‌లో శరత్ కమల్ | sharath kamal entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శరత్ కమల్

Published Sat, Mar 14 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

క్వార్టర్స్‌లో శరత్ కమల్

క్వార్టర్స్‌లో శరత్ కమల్

ఆసియా కప్ టీటీ
 జైపూర్: సంచలన ప్రదర్శనతో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ ఆసియా కప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రూప్ ‘బి’లో 32 ఏళ్ల శరత్ కమల్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాడు.
 
 తొలి మ్యాచ్‌లో శరత్ 11-6, 7-11, 11-5, 11-3తో ప్రపంచ 8వ ర్యాంకర్ చువాంగ్ చియె యువాన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... రెండో మ్యాచ్‌లో 11-3, 4-11, 11-8, 7-11, 13-11తో ప్రపంచ 16వ ర్యాంకర్ జూ సేయుక్ (దక్షిణ కొరియా)ను కంగుతినిపించాడు.  ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాన్ జెంగ్‌డాంగ్ (చైనా)తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో శరత్ 4-11, 8-11, 2-11తో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement