సాక్షి, హైదరాబాద్: ఇటీవల జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగి మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుక్రవారం రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా శ్రీజను, ఆమె కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌ను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment