నైనా జైశ్వాల్(ఫైల్‌ఫోటో)
హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ను గత కొంతకాలంగా వేధిస్తున్న శ్రీకాంత్ అనే పోకిరీని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా నైనా జైశ్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య మెసేజ్‌లు పోస్ట్ చేసి శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ మేరకు శ్రీకాంత్ అనే యువకుడ్ని హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే గతంలో సిద్ధిపేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నైనా జైశ్వాల్‌కు మరోసారి అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. దాంతో నైనా జైశ్వాల్ తండ్రి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకుడ్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment