![India Junior Player Paras Jain Enter Semis Bronze Medal World Junior TT - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/8/payas.jpg.webp?itok=p8yPTMAT)
ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం ఖరారైంది. పోర్చుగల్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో అండర్–19 బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్ పాయస్ జైన్ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాయస్ జైన్ 11–9, 11–8, 11–8, 8–11, 11–4తో నవీద్ షమ్స్ (ఇరాన్)పై గెలిచాడు. అండర్–15 బాలికల డబుల్స్‌లో సుహానా సైనీ (భారత్)–వెరోనికా (ఉక్రెయిన్) జంట సెమీఫైనల్లో ఓడి కాంస్యం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment