ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగి అయిన శ్రీజ సింగిల్స్ తొలి రౌండ్‌లో 11–4, 11–7, 12–10తో సితీ అమీనా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. డబుల్స్ తొలి రౌండ్‌లో శ్రీజ–అర్చన కామత్ (భారత్) జోడీ 11–5, 11–3, 11–6తో సోనమ్ సుల్తానా–సాదియా (బంగ్లాదేశ్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ–అర్చన ద్వయం 10–12, 7–11, 12–10, 13–15తో డు హై కెమ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment