దుబాయ్: ఆసియా యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇంకా అడుగు పెట్టక ముందే భారత్‌కు కనీసం 21 పతకాలు ఖరారయ్యాయి! ఈ నెల 24నుంచి దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి వేర్వేరు వెయిట్ కేటగిరీలలో భారత్ తరఫున 250 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు. కోవిడ్, ప్రయాణ ఆంక్షల కారణంగా వివిధ దేశాలనుంచి పెద్ద సంఖ్యలో బాక్సర్లు తప్పుకోవడంతో ‘డ్రా’ బాగా చిన్నదిగా మారిపోయింది. దాంతో కనీసం 21 పతకాలు ఖాయం కాగా, ఇందులో 9 మంది నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment