
గొర్గాన్ (ఇరాన్): కబడ్డీలో తమకు తిరుగులేదని భారత పురుషుల, మహిళల జట్లు మరోసారి నిరూపించాయి. ఆదివారం ముగిసిన ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పురుషుల, మహిళల విభాగాల్లో చాంపియన్స్‌గా నిలిచాయి. పురుషుల ఫైనల్లో టీమిండియా 36–22తో పాకిస్తాన్‌ను చిత్తు చేయగా... మహిళల జట్టు ఫైనల్లో 42–20తో కొరియాను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో విశేషంగా రాణించిన అజయ్ ఠాకూర్, ప్రదీప్ నర్వాల్ అదే జోరును ఆసియా టోర్నీలోనూ కొనసాగించి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.