భారత్‌కు మూడు స్వర్ణాలు
►నీహారికకు రజతం
►ప్రపంచ జూనియర్ బాక్సింగ్
తైపీ : అంచనాలకు మించి రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారిక (70 కేజీలు)తో పాటు సోనియా (48 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. ఇదే వేదికపై జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో జమునా బోరో (57 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించింది.
దోహాలో మరో నాలుగు స్వర్ణాలు
న్యూఢిల్లీ: దోహా అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్లు మెరిశారు. శనివారం జరిగిన ఈవెంట్లో నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు దక్కాయి. ఎల్.దేవేంద్రో సింగ్ (49కేజీ), శివ థాపా (56కేజీ), మనీష్ కౌశిక్ (60కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) స్వర్ణాలు గెలుచుకోగా గౌరవ్ బిధూరి (52కేజీ) రజతం, మన్దీప్ జాన్‌గ్రా (69కేజీ), వికాస్ క్రిషన్ (75కేజీ) కాంస్యాలు సాధించారు. అక్టోబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ జరుగుతోంది.