
చెంగ్డూ (చైనా): పురుషుల ప్రపంచకప్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుతం చేశాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మెగా ఈవెంట్‌లో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గ్రూప్ ‘డి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ తనకంటే మెరుగైన ర్యాంకు ఉన్న ఆటగాళ్లను కంగుతినిపించాడు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న ప్రపంచ 30వ ర్యాంకర్ సత్యన్ తొలి మ్యాచ్‌లో 4–3 (11–13, 9–11, 11–8, 14–12, 7–11, 11–5, 11–8)తో 22వ ర్యాంకర్ సైమన్ గాజీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు.
అనంతరం రెండో మ్యాచ్‌లో 26 ఏళ్ల ఈ చెన్నై ప్లేయర్ 4–2 (11–3, 12–10, 7–11, 16–14, 8–11, 11–8)తో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 24వ ర్యాంకర్ గ్రోత్ జొనథన్‌ను ఇంటిదారి పట్టించాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, గత రెండు ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన టిమో బోల్ (జర్మనీ)తో సత్యన్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment