Telangana paddler Akula Sreeja won 3 gold in Table Tennis - Sakshi
Sakshi News home page

Akula Sreeja: ఆకుల శ్రీజ సంచలనం.. ఒకేసారి మూడు టైటిల్స్‌

Published Tue, Mar 28 2023 8:34 AM

Telangana Girl Akula Sreeja Won 3 Major-Titles In Table Tennis - Sakshi

జమ్మూ: తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో టైటిల్స్‌ సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ నిలబెట్టుకోగా... డబుల్స్‌ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది.

మహిళల టీమ్‌ ఈవెంట్‌లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్‌బీఐ జట్టు టైటిల్‌ సాధించింది. సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్‌)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్‌–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది. టీమ్‌ ఫైనల్లో ఆర్‌బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మొహమ్మద్‌ అలీ–వంశ్‌ సింఘాల్‌ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్‌ చంద్ర–అంకుర్‌ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్‌) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement