మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ మస్కట్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 3–11, 11–7, 12–10, 9–11, 12–10తో హుయ్ జింగ్ యాంగ్ (చైనా)పై గెలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగి అయిన 23 ఏళ్ల శ్రీజ తొలి రౌండ్‌లో 11–4, 11–6, 11–8తో జాంగ్ వాన్లింగ్ (సింగపూర్) పై, రెండో రౌండ్‌లో 11–6, 11–4, 11–5తో ఇవా జుర్కోవా (స్లొవేకియా)పై నెగ్గింది.
చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment