హర్మీత్‌ ‘డబుల్‌’ ధమాకా | Indian star player Harmeet Desai won two titles | Sakshi
Sakshi News home page

హర్మీత్‌ ‘డబుల్‌’ ధమాకా

Published Tue, Nov 5 2024 4:07 AM | Last Updated on Tue, Nov 5 2024 4:07 AM

Indian star player Harmeet Desai won two titles

పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ సొంతం

భార్య కృత్వికతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలోనూ విజేతగా నిలిచిన భారత టీటీ స్టార్‌  

కరాకస్‌ (వెనిజులా): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ కరాకస్‌ టోర్నీలో భారత స్టార్‌ ప్లేయర్‌ హర్మీత్‌ దేశాయ్‌ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ నెగ్గడంతోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తన భార్య కృత్విక రాయ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. 

ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 90వ స్థానంలో ఉన్న హర్మీత్‌ ఫైనల్లో 11–7, 11–8, 11–6తో జో సీఫ్రయిడ్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. 22 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హర్మీత్‌ తన సర్వీస్‌లో 14 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్‌లో 19 పాయింట్లు సంపాదించాడు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో హర్మీత్‌–కృత్విక రాయ్‌ ద్వయం 8–11, 11–9, 11–8, 9–11, 11–5తో జార్జి కాంపోస్‌–డానియెలా ఫొన్సెకా కరాజానా (క్యూబా) జోడీపై గెలుపొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement