Harmeet Desai
-
హర్మీత్ ‘డబుల్’ ధమాకా
కరాకస్ (వెనిజులా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ కరాకస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ హర్మీత్ దేశాయ్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గడంతోపాటు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన భార్య కృత్విక రాయ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 90వ స్థానంలో ఉన్న హర్మీత్ ఫైనల్లో 11–7, 11–8, 11–6తో జో సీఫ్రయిడ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 22 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హర్మీత్ తన సర్వీస్‌లో 14 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్‌లో 19 పాయింట్లు సంపాదించాడు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో హర్మీత్–కృత్విక రాయ్ ద్వయం 8–11, 11–9, 11–8, 9–11, 11–5తో జార్జి కాంపోస్–డానియెలా ఫొన్సెకా కరాజానా (క్యూబా) జోడీపై గెలుపొందింది. -
అర్జున అవార్డుకు మనిక, హర్మీత్ల పేర్లు ప్రతిపాదన
గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి మనిక బాత్రా, హర్మీత్ దేశాయ్ పేర్లను భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. ‘గోల్డ్‌కోస్ట్‌లో మనిక, హర్మీత్లు అద్భుత ప్రదర్శన చేశారు. అందుకే అర్జున అవార్డు కోసం వారి పేర్లను సూచించాం. తుది ఎంపిక విషయంలో ప్రభుత్వ కమిటీకి మనిక పేరు విస్మరించడం చాలా కష్టం’ అని టీటీఎఫ్ఐ అధికారి తెలిపారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు హర్మీత్ దేశాయ్
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు హర్మీత్ దేశాయ్ తొలిసారి తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. బుధవారం అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 5 స్థానాలు మెరుగుపరుచుకొని 95వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు శరత్ కమల్ 54వ స్థానంలో కొనసాగుతుండగా... సౌమ్యజిత్ ఘోష్ ఒక స్థానానికి ఎగబాకి 83వ ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో తొలిసారి భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు టాప్–100లో చోటు దక్కించుకున్నట్లయింది. మహిళల విభాగంలో మనికా బాత్రా 10 స్థానాలు దిగజారి 103 ర్యాంకుకి పడిపోయింది. యూత్ బాలుర విభాగంలో అర్జున్ ఘోష్ 98వ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో ఐహిక ముఖర్జీ 2 స్థానాలు ఎగబాకి 35వ స్థానాన్ని, అర్చన కామత్ 3 ర్యాంకులు కోల్పోయి 59వ స్థానాన్ని దక్కించుకున్నారు. -
భారత్ ‘డబుల్’ ధమాక
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ రెండో డివిజన్ టైటిల్స్ సొంతం కౌలాలంపూర్: భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు కొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్‌లో రెండో డివిజన్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించాయి. శనివారం జరిగిన రెండో డివిజన్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 3-2తో బ్రెజిల్‌ను ఓడించగా... భారత మహిళల జట్టు 3-1తో లక్సెంబర్గ్‌పై విజయం సాధించింది. ఫైనల్స్‌కు చేరుకున్న భారత పురుషుల, మహిళల జట్లతోపాటు బ్రెజిల్, లక్సెంబర్గ్ కూడా 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్-24 జట్లు పాల్గొనే ‘చాంపియన్‌షిప్’ డివిజన్‌కు అర్హత సాధించాయి. చాంపియన్‌షిప్ డివిజన్‌కు అర్హత పొందడం భారత టీటీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రెజిల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున హర్మీత్ దేశాయ్ రెండు మ్యాచ్‌ల్లో గెలువగా... సౌమ్యజిత్ ఘోష్ మరో మ్యాచ్‌లో నెగ్గాడు. తొలి మ్యాచ్‌లో సౌమ్యజిత్ 13-15, 4-11, 7-11తో హుగో కాల్డెరానో చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో హర్మీత్ 11-3, 8-11, 8-11, 11-8, 11-9తో కజువో మత్సుమోటోపై నెగ్గాడు. మూడో మ్యాచ్‌లో ఆంథోనీ అమల్‌రాజ్ 11-8, 7-11, 11-5, 9-11, 9-11తో థియాగో మోంటీరో చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో సౌమ్యజిత్ 11-6, 14-12, 11-9తో కజువో మత్సుమోటోపై గెలవడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 4-11, 11-5, 15-13, 11-6తో హుగో కాల్డెరానోపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. లక్సెంబర్గ్‌తో జరిగిన మహిళల విభాగం ఫైనల్లో తొలి మ్యాచ్‌లో మౌమా దాస్ 11-1, 11-4, 13-11తో డానియెలాపై, రెండో మ్యాచ్‌లో మనిక బాత్రా 11-6, 11-2, 9-11, 13-11తో టెస్సీ గొండెరింగర్పై గెలిచారు. మూడో మ్యాచ్‌లో షామిని 4-11, 9-11, 9-11తో సారా డు నెట్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 11-4, 11-8తో డానియెలాపై నెగ్గడంతో భారత్‌కు 3-1తో విజయం దక్కింది. ఈ పోటీల్లో భారత మహిళల జట్టు అజేయంగా నిలువడం విశేషం.