ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఐదోరోజు భారత్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.
మూడో సీడ్ పై లక్ష్య గెలుపు
బుధవారం నాటి మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్, మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్ ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్‌లో అన్‌సీడెడ్ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్.
Lakshya Sen 2️⃣ - 0️⃣ Jonatan Christie
Sensational Sen has defeated World No.3 Christie 🇮🇩 in straight sets 21-18, 21-12
Lakshya qualifies for Pre-QF, Well Done 🇮🇳♥️#Badminton #Paris2024 pic.twitter.com/q6klX0L0AY— The Khel India (@TheKhelIndia) July 31, 2024
ఆకుల శ్రీజ సంచలన విజయం
మరోవైపు.. వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్ చేరిన ప్లేయర్‌గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 16 శ్రీజ.. సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్‌తో తలపడింది.
తొలి గేమ్‌లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.
ఫైనల్లో స్వప్నిల్ కుసాలే
50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్‌ఈవెంట్‌కు అర్హత సాధించాడు.
ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు.
చదవండి: ‘పిస్టల్’తో పంట పండించాడు!
Comments
Please login to add a commentAdd a comment