సాక్షి, న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సన్మానం చేశారు. ఆమెతో పాటు ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ నేతృత్వంలో పలువురు బాక్సర్లను సన్మానించారు. కాంస్య పతక విజేతలు మనీషా , పర్వీన్‌కు ఆయన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఒలంపిక్ పతకం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం కామన్వెల్త్ పోటీలు. ఇక ఒలంపిక్ పతకం సాధించేందుకు రెట్టింపు కృషి అవసరం. ఇందుకు నాకు ఇంకా చాలా మద్దతు కావాలి. ముస్లిం మహిళగా ఈ క్రీడల్లో రాణించే అంశంపై ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ అధిగమించాను.
మా నాన్న కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించమన్నారు. రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు సాధన చేశా. నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, స్పాన్సర్లు మద్దతుతో ఇక్కడి వరకు రాగలిగాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేసింది. ఒలంపిక్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నా’’ అని జరీన్ పేర్కొన్నారు.
చదవండి👉🏾IPL 2022- CSK: వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండబోడు.. 16 కోట్లు మిగులుతాయి.. కానీ!
చదవండి👉🏾Hijab Row: హిజాబ్‌పై స్పందించిన నిఖత్ జరీన్.. ఆమె ఏమన్నారంటే..?
Comments
Please login to add a commentAdd a comment