
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ మళ్లీ ధర్నాకు దిగారు. మేరీకోమ్ కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని ‘జంతర్ మంతర్’ వద్ద చేపట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత జనవరిలో రెజ్లర్లు కొన్ని రోజులపాటు ధర్నాకు దిగారు.
కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపి మేరీకోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ జరిపింది. ఇటీవల కమిటీ నివేదిక క్రీడాశాఖకు సమర్పించినా దీన్ని బహిర్గతం చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment