అనురాగ్ కొణిదెన, అవికాగోర్ జంటగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. జెమిని ఎఫ్‌ఎక్స్ సమర్పణలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కోటేశ్వరరావు నిర్మిస్తుండగా, అవికా గోర్ మరో నిర్మాత. తొలి సీన్‌కి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చిత్ర సమర్పకులు పీవీఆర్ మూర్తి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. తమిళం, కన్నడలో హిట్టయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నిర్మాణ సంస్థను ప్రారంభించి, జెమిని వారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అవికా. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది’’ అన్నారు అనురాగ్. ‘‘మార్చి 4న తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు సత్వం ద్వారపూడి. ‘‘ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన గాయనీ– గాయకులకు చాన్స్ ఇస్తాం’’ అన్నారు సంగీత దర్శకుడు శక్తికాంత్. ఈ చిత్రానికి కెమెరా: రఘు.
Comments
Please login to add a commentAdd a comment