avika gaur
-
ఆది సాయికుమార్-అవికా గౌర్ కొత్త సినిమా ప్రారంభం
వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్-1’. ఇందులో అవికా గోర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్టగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్ టచ్ కూడా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాతలు. అన్కాంప్రమైజ్డ్గా చేయబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్ చేసే కథాంశంతో థ్రిల్లర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర్ శంకర్, పవిత్రా లోకేశ్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
నవ్వులే నవ్వులు
అనురాగ్ కొణిదెన, అవికాగోర్ జంటగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. జెమిని ఎఫ్ఎక్స్ సమర్పణలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కోటేశ్వరరావు నిర్మిస్తుండగా, అవికా గోర్ మరో నిర్మాత. తొలి సీన్‌కి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చిత్ర సమర్పకులు పీవీఆర్ మూర్తి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. తమిళం, కన్నడలో హిట్టయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నిర్మాణ సంస్థను ప్రారంభించి, జెమిని వారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అవికా. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది’’ అన్నారు అనురాగ్. ‘‘మార్చి 4న తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు సత్వం ద్వారపూడి. ‘‘ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన గాయనీ– గాయకులకు చాన్స్ ఇస్తాం’’ అన్నారు సంగీత దర్శకుడు శక్తికాంత్. ఈ చిత్రానికి కెమెరా: రఘు. -
ఇదే సరైన కథ అనుకున్నా: అవికా గోర్
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్, ‘ఉయ్యాల జంపాలా, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన అవికా గోర్ నిర్మాతగా మారారు. ఆచార్య క్రియేషన్స్ నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలసి అవికా స్క్రీన్ క్రియేషన్స్‌పై ఓ సినిమా నిర్మించనున్నారామె. సాయి రోనక్, అవికా గోర్ జంటగా మురళీ నాగశ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘కథ బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను’’ అన్నారు అవికా. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం.ఎస్. చలపతి రాజు. -
మామా అల్లుళ్ల సవాల్!
ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నాడు? అలాగే తమను వ్యతిరేకించినఅమ్మాయి తండ్రిని ఎలా ఆడుకున్నాడు? ఫైనల్‌గా తమ ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకెళ్లాడు? అనే కథాంశంతో తె రకెక్కిన చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా, రావు రమేశ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. సాహిల్, జి.సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. రావు రమేశ్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సోమనాథ్ చటర్జీ. బెంగాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నటించాను. మా నాన్నగారు రావు గోపాలరావు, చిరంజీవిగారు మామా అల్లుళ్లగా నటించిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రం కూడా అంతే విజయం సాధిస్తుంది. ఈ సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు చాలా బాగుందన్నారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో నాకు, అవికా గోర్‌కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ మంచి ప్రేమకథకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు’’ అని రాజ్ తరుణ్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్-దాశరథి శివేంద్ర.