
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్‌లపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వీరిని తొలగించాలని బీజేపీని ఈసీ ఆదేశించింది. వీరిరువురిని స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ తక్షణమే తొలగించాలని బీజేపీని ఆదేశిస్తూ ఈసీ ఓ ప్రకటన జారీ చేసింది.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఠాకూర్, వర్మలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాతి విద్రోహులను కాల్చివేయాలని ఠాకూర్ పాల్గొన్న సభలో నినాదాలు మిన్నంటగా, సీఏఏను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనకు దిగిన ఆందోళనకారులను ఉద్దేశించి వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లక్షలాది మంది అక్కడ (షహీన్‌బాగ్) గుమికూడారు..వారు ఎప్పుడైనా మీ ఇళ్లలోకి వచ్చి మీ అక్కాచెల్లెళ్లు, కుమార్తెలపై హత్యాచారాలకు తెగబడవచ్చు..రేపు మిమ్మల్ని మోదీజీ, అమిత్ షాలు కూడా కాపాడలేర’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment