Delhi Election 2020
-
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు పోటాపోటీగా పాల్గొంటున్నాయి. అదేవిధంగా ప్రచారంలో ఆప్, బీజేపీ చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో బాదర్పూర్ నియోజకర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ దత్ శర్మపై బుధవారం దాడి జరిగింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి జరగటం ఢిల్లీలో చర్చనీయ అంశంగా మారింది. నారయణ్ దత్ శర్మ తన కారులో పార్టీ మీటింగ్‌కు హాజరై తిరిగి వస్తుండగా పదిమంది గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పగిలి మీద పడటంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ దత్.. తన రాజకీయ ప్రత్యర్థులు ఈ దాడి చేయించారని ఆరోపించారు. కాగా, ఇటీవల ఆయన ఆప్ నుంచి బయటకు వచ్చి బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బాదర్పూర్ నియోజకవర్గంలో ఆప్ ఆయనకు టికెట్ నిరాకరిచంటంతో బీఎస్పీలో చేరినట్లు తెలుస్తోంది. -
'ఒవైసీ కూడా త్వరలో హనుమాన్ చాలీసా చదువుతారు'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతారని యూపీ సీఎం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇవాళ కిరారిలో జరిగిన ప్రచార సభలో యోగి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టారని, ఇక ముందు ఏం జరుగుతుందో కూడా మీకే తెలుస్తుందని, ఎంఐఎం నేత ఒవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతూ కనిపిస్తారని అన్నారు. ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలను ఆదిత్యనాథ్ ఖండించారు. సీఏఏ నిరసనకారులకు ఇలాంటి నేతలు బిర్యానీలు అందిస్తున్నారని, మరో వైపు చాలీసా వల్లిస్తున్నారని యోగి ఆరోపించారు. అయితే యోగి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఢిల్లీలో ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేదం విధించాలని ఆప్ ఆదివారం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక పాలక ఆప్ ప్రమేయం ఉందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఆప్ సర్కార్ గత ఐదేళ్లలో ఆస్పత్రులు, ఫ్లైఓవర్లు, కాలేజీలు, రోడ్లు నిర్మిస్తే షహీన్‌బాగ్‌ను నిర్మించే అవసరం లేకపోయేదని వ్యాఖ్యానించారు. ఆప్ షహీన్‌బాగ్‌ను ప్రేరేపిస్తే ఢిల్లీ ప్రజలు షహీన్‌బాగ్‌తో పాటు సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారని మిశ్రా ట్వీట్ చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ఫిబ్రవరి 8న ఇండియా, పాకిస్తాన్ల పోరును తలపిస్తుందని కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. మిశ్రాను 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆప్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చదవండి : కపిల్ మిశ్రాపై 48 గంటల నిషేధం -
ఠాకూర్, వర్మలపై ఈసీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్‌లపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వీరిని తొలగించాలని బీజేపీని ఈసీ ఆదేశించింది. వీరిరువురిని స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ తక్షణమే తొలగించాలని బీజేపీని ఆదేశిస్తూ ఈసీ ఓ ప్రకటన జారీ చేసింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఠాకూర్, వర్మలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాతి విద్రోహులను కాల్చివేయాలని ఠాకూర్ పాల్గొన్న సభలో నినాదాలు మిన్నంటగా, సీఏఏను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనకు దిగిన ఆందోళనకారులను ఉద్దేశించి వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లక్షలాది మంది అక్కడ (షహీన్‌బాగ్) గుమికూడారు..వారు ఎప్పుడైనా మీ ఇళ్లలోకి వచ్చి మీ అక్కాచెల్లెళ్లు, కుమార్తెలపై హత్యాచారాలకు తెగబడవచ్చు..రేపు మిమ్మల్ని మోదీజీ, అమిత్ షాలు కూడా కాపాడలేర’ని అన్నారు. చదవండి : ‘వారు ఇళ్లలోకి వచ్చి హత్యాచారాలు చేస్తే దిక్కెవరు’ -
ఇది ఏకత్వంలో భిన్నత్వమా!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘హింస అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. రండి, మనమంతా కలిసి శాంతిప్రాతిపదికన ప్రతి సమస్యను పరిష్కరించుకునే కొత్త భారతవనిని ఆవిష్కరిద్దాం! ఏ సమస్య పరిష్కారానికైనా సంఘీభావం ముఖ్యం’ అని ప్రధాని నరేంద్ర మోదీ సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలనుద్దేశించి జనవరి 26వ తేదీన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఆయన మంత్రులు, ఆయన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలేమో ఆయన మాటలకు, స్ఫూర్తికి పూర్తి భిన్నంగా హింసను ప్రోత్సహిస్తున్నారు. ‘షహీన్‌బాగ్‌లో ఎంతటి ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయో, అదే స్థాయిలో, అదే ఆగ్రహావేశాలతో ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ యంత్రంపైనున్న మీట నొక్కాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ వాసులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో శాంతి సందేశం వినిపించిన మరుసటి రోజే అమిత్ షా ఇలా మాట్లాడడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో గత డిసెంబర్ నెల నుంచి నిరంతరం ప్రజాందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. అదే రోజు, జనవరి 27వ తేదీన పార్టీ కార్యలను ఉద్ధేశించి మాట్లాడుతూ ‘దేశ్ కే గద్దారోం కో అని పిలుపునివ్వగా, గోలీ మారో సాలోం కో’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ జనవరి మొదట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇలాంటి వారిని ఉత్తరప్రదేశ్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లోని మా ప్రభుత్వాలు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేశాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ మాట్లాడుతూ ‘ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న లక్షలాది మంది రేపు మీ ఇళ్లలో జొరబడి మీ చెల్లెళ్లను, మీ కూతుళ్లను రేప్ చేసి, చంపేస్తారు. రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని గెలపించాలో ఢిల్లీ వాసులు గట్టిగా ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు. -
సీఏఏ విమర్శకులపై అమిత్ షా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజధాని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నిప్పులు చెరిగారు. షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బీజేపీకి మీరు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో వందలాది మంది గత 30 రోజులుగా చేపట్టిన నిరసనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా షహీన్‌బాగ్ ఘటనను అమిత్ షా ఆక్షేపించడాన్ని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా సాగే ఆందోళనలను తోసిపుచ్చడం అంటే మహాత్మాగాంధీ ప్రవచించిన అహింసా వాదాన్ని తోసిపుచ్చడమేనని వ్యాఖ్యానించారు. చదవండి : శత్రు ఆస్తుల అమ్మకానికి మంత్రుల బృందం