
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతారని యూపీ సీఎం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇవాళ కిరారిలో జరిగిన ప్రచార సభలో యోగి పాల్గొన్నారు.
అక్కడ ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టారని, ఇక ముందు ఏం జరుగుతుందో కూడా మీకే తెలుస్తుందని, ఎంఐఎం నేత ఒవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతూ కనిపిస్తారని అన్నారు. ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలను ఆదిత్యనాథ్ ఖండించారు. సీఏఏ నిరసనకారులకు ఇలాంటి నేతలు బిర్యానీలు అందిస్తున్నారని, మరో వైపు చాలీసా వల్లిస్తున్నారని యోగి ఆరోపించారు. అయితే యోగి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఢిల్లీలో ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేదం విధించాలని ఆప్ ఆదివారం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment