UP CM Yogi Adityanath's Reaction On Gyanvapi Row, MIM Owaisi Objects - Sakshi
Sakshi News home page

జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

Published Mon, Jul 31 2023 2:45 PM | Last Updated on Mon, Jul 31 2023 3:28 PM

UP CM Yogi Adityanath Reacts On Gyanvapi Row MIM Owaisi Objects - Sakshi

జ్ఞానవాపిలో జ్యోతిర్లింగం, త్రిశూలం, విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి?.. 

లక్నో/ఢిల్లీ: జ్ఞానవాపి మసీదు అంశంపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని.. సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ వారికి ఉందంటూ వ్యాఖ్యానించారాయన. సోమవారం ఉదయం ఓ జాతీయ మీడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న  ఆయన జ్ఞానవాపిపై స్పందించారు. 

‘‘జ్ఞానవాపిలో జ్యోతిర్లింగం ఉంది. దానిని మేమేవరం ఉంచలేదు. విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికైనా చారిత్రక తప్పిదం సరిదిద్దుకుంటామనే ప్రతిపాదన ముస్లింల నుంచి రావాలి. జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తేనే అది వివాదం అయినట్లు లెక్క. అక్కడి ప్రజలు ఆలోచించాలి. అసలు అక్కడ త్రిశూలానికి ఏం పని? అని ఆ పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. ఈ సాయంత్రం ఆ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుంది. 

ఒవైసీ అభ్యంతరం.. 
జ్ఞానవాపిపై సీఎం యోగి వ్యాఖ్యలను ఏఐఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. ‘‘90వ దశకంలోకి మేం వెళ్లాలనుకోవట్లేదు. చట్టం ప్రకారం.. మా హక్కుల  ప్రకారమే మేం అక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నాం. కేసు కోర్టులో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? అని ఎంఐఎం నేత వారిస్‌ పథా తప్పుబట్టారు. 

ఇదిలా ఉంటే.. మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ఈ అంశంపై స్పందించారు. ‘‘అలహాబాద్ హైకోర్టులో ఏఎస్ఐ సర్వేను ముస్లిం వైపు వ్యతిరేకించారని, మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువడుతుందని సీఎం యోగికి తెలుసు. అయినప్పటికీ అతను అలాంటి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు. ఇది న్యాయపరిధిని ఉల్లంఘించడమే అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement