kasi viswanathaswamy temple
-
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో.. సీల్ చేసిన మసీదు బేస్మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. 'జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసేందుకు హిందు పక్షం వారికి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా యంత్రాంగా ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణ మోహన్ పాండ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జ్ఞానవాపిలోను నేలమాళిగ తాళాలు తెరవాలని కోర్టు ఆదేశించింది.' అని హిందువుల తరుపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఏఎస్ఐ సర్వే నేపథ్యంతో మసీద్ బేస్మెంట్కు సీల్ వేశారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ బారికేడ్లను తొలగించనున్నారు. అంతేకాదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఇటీవల నివేదిక ఇచ్చింది. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వేలో తేలింది. దీంతో హిందూ పక్షం వారు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: Indian Army: ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు? -
జ్ఞానవాపిపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో/ఢిల్లీ: జ్ఞానవాపి మసీదు అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని.. సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ వారికి ఉందంటూ వ్యాఖ్యానించారాయన. సోమవారం ఉదయం ఓ జాతీయ మీడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన జ్ఞానవాపిపై స్పందించారు. ‘‘జ్ఞానవాపిలో జ్యోతిర్లింగం ఉంది. దానిని మేమేవరం ఉంచలేదు. విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికైనా చారిత్రక తప్పిదం సరిదిద్దుకుంటామనే ప్రతిపాదన ముస్లింల నుంచి రావాలి. జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తేనే అది వివాదం అయినట్లు లెక్క. అక్కడి ప్రజలు ఆలోచించాలి. అసలు అక్కడ త్రిశూలానికి ఏం పని? అని ఆ పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. ఈ సాయంత్రం ఆ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ज्ञानवापी को मस्जिद कहेंगे तो होगा विवाद, वहां त्रिशूल क्या कर रहा है? सीएम योगी का बड़ा बयान#YogiAdityanath#Gyanvapi pic.twitter.com/tI8qnT23Cy — Manish Pandey MP (@joinmanishpande) July 31, 2023 ఒవైసీ అభ్యంతరం.. జ్ఞానవాపిపై సీఎం యోగి వ్యాఖ్యలను ఏఐఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. ‘‘90వ దశకంలోకి మేం వెళ్లాలనుకోవట్లేదు. చట్టం ప్రకారం.. మా హక్కుల ప్రకారమే మేం అక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నాం. కేసు కోర్టులో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? అని ఎంఐఎం నేత వారిస్ పథా తప్పుబట్టారు. ఇదిలా ఉంటే.. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ అంశంపై స్పందించారు. ‘‘అలహాబాద్ హైకోర్టులో ఏఎస్ఐ సర్వేను ముస్లిం వైపు వ్యతిరేకించారని, మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువడుతుందని సీఎం యోగికి తెలుసు. అయినప్పటికీ అతను అలాంటి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు. ఇది న్యాయపరిధిని ఉల్లంఘించడమే అని తెలిపారు. #WATCH | On UP CM Yogi Adityanath’s Gyanvapi statement, AIMIM MP Asaduddin Owaisi says "CM Yogi knows that the Muslim side has opposed ASI survey in Allahabad High Court and the judgement will be given in a few days, still he gave such a controversial statement, this is judicial… pic.twitter.com/IuBSqMHepv — ANI (@ANI) July 31, 2023 -
ఆలయంలో చోరీ.. విగ్రహాల అపహరణ
నెల్లూరు: దొంగలకు ఇళ్లు కరువయ్యాయేమో.. అందుకే గృహాలు వదిలేసి ఆలయాల బాట పట్టినట్టున్నారు. నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కాశీ విశ్వనాథ ఆలయంలో భారీ చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆలయ తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ చోరీలో ఆలయంలోని 85 కిలోల బరువు గల దక్షిణా మూర్తి పంచలోహ విగ్రహాన్ని అపహరించారు. ఈ విగ్రహం విలువ సుమారు రూ. కోటి ఉండవచ్చని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోకి దుండగులు వెనుక ద్వారం నుంచి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీంకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (వెంకటగిరి)