నెల్లూరు: దొంగలకు ఇళ్లు కరువయ్యాయేమో.. అందుకే గృహాలు వదిలేసి ఆలయాల బాట పట్టినట్టున్నారు. నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కాశీ విశ్వనాథ ఆలయంలో భారీ చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆలయ తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ చోరీలో ఆలయంలోని 85 కిలోల బరువు గల దక్షిణా మూర్తి పంచలోహ విగ్రహాన్ని అపహరించారు.
ఈ విగ్రహం విలువ సుమారు రూ. కోటి ఉండవచ్చని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోకి దుండగులు వెనుక ద్వారం నుంచి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీంకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(వెంకటగిరి)
ఆలయంలో చోరీ.. విగ్రహాల అపహరణ
Published Sat, Apr 11 2015 10:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement