ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో.. సీల్ చేసిన మసీదు బేస్‌మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది.
'జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలు చేసేందుకు హిందు పక్షం వారికి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా యంత్రాంగా ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణ మోహన్ పాండ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జ్ఞానవాపిలోను నేలమాళిగ తాళాలు తెరవాలని కోర్టు ఆదేశించింది.' అని హిందువుల తరుపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు.
సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఏఎస్‌ఐ సర్వే నేపథ్యంతో మసీద్ బేస్‌మెంట్‌కు సీల్ వేశారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ బారికేడ్లను తొలగించనున్నారు. అంతేకాదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్‌ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) ఇటీవల నివేదిక ఇచ్చింది. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వేలో తేలింది. దీంతో హిందూ పక్షం వారు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: Indian Army: ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment