సాక్షి, నిజామాబాద్: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అసద్‌ను పోలీసులు ఝాన్నీ వద్ద కాల్చి చంపారు. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
కాగా, ఒవైసీ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో జునైద్, నాసిర్‌లను చంపినవాళ్లను బీజేపీ ఎన్‌కౌంటర్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇవాళ మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. చట్టాలను ఆ పార్టీ బలహీనపరుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ఎన్‌కౌంటర్ చేస్తోందని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ చేసుకుంటూ పోతే అప్పుడు కోర్టులు, చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మైనార్టీల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ విషయంలో కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్నారు. మజ్లిస్ సేవకుడిగా అసదుద్దీన్ ఒవైసీ ఎప్పటి వరకు ఉంటాడో అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Will the BJP also shoot those who killed Junaid and Nasir? No, because you (BJP) do encounters in the name of religion. You want to weaken the rule of law, do encounter of the Constitution: AIMIM MP Asaduddin Owaisi in Telangana's Nizamabad pic.twitter.com/H0a1xqRIC3
— ANI (@ANI) April 13, 2023
Comments
Please login to add a commentAdd a comment