న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు పోటాపోటీగా పాల్గొంటున్నాయి. అదేవిధంగా ప్రచారంలో ఆప్, బీజేపీ చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో బాదర్పూర్ నియోజకర్గం బీఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ దత్ శర్మపై బుధవారం దాడి జరిగింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి జరగటం ఢిల్లీలో చర్చనీయ అంశంగా మారింది.
నారయణ్ దత్ శర్మ తన కారులో పార్టీ మీటింగ్‌కు హాజరై తిరిగి వస్తుండగా పదిమంది గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పగిలి మీద పడటంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ దత్.. తన రాజకీయ ప్రత్యర్థులు ఈ దాడి చేయించారని ఆరోపించారు. కాగా, ఇటీవల ఆయన ఆప్ నుంచి బయటకు వచ్చి బీఎస్‌పీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బాదర్పూర్ నియోజకవర్గంలో ఆప్ ఆయనకు టికెట్ నిరాకరిచంటంతో బీఎస్‌పీలో చేరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment