BSP MLA
-
‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: ప్రజలు స్వచ్ఛందంగా లంచం ఇస్తే తీసుకోవాలనే గానీ, బలవంతంగా వసూలు చేయడం తగదంటూ అధికారులకు ఓ ఎమ్మెల్యే చెప్పడం వివాదాస్పదంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ఎమ్మెల్యే రాంబాయి సింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దామోహ్ జిల్లా పథారియా నియోజకవర్గం సతావువా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాయి పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధి పొందేందుకు తా చదవండి: నిజం కోసమే నా పోరాటం: నవజోత్ సింగ్ సిద్ధూ దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని వారికి సూచించారు. ప్రజలు రూ.500, రూ.1,000.. ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ, వారివద్ద ఉన్నదంతా లాగేసుకోవాలని చూడటం తగదని హితవు పలికారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపించి, లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దామోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాంబాయి సింగ్ సమర్థించుకున్నారు. సతావువా గ్రామ నిరుపేదలు ఎంత కష్టపడినా నెలకు రూ.6వేలు సంపాదించడం కష్టమని తెలిపారు. అటువంటి వారు ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ రూ.10 వేల చొప్పున బలవంతంగా రాబట్టాలని చూడటం తగదని తాను చెప్పానన్నారు. చదవండి: పళ్లు ఊడిపోయాయని ఏకంగా ప్రధాని మోదీకే లెటర్, వైరల్ म.प्र: दमोह जिले के पथरिया की महिला विधायक रामबाई का यह वीडियो इस समय वायरल हो रहा है। रामबाई वही हैं जिनके पति पर हत्या का आरोप है। समय-समय पर उनके अपने क्षेत्र के लोगों की समस्या के निराकरण के दौरान उऩके संवादों के वीडियो वायरल होते रहते हैं #ViralVideo pic.twitter.com/TAcb6x65FT — Hindustan (@Live_Hindustan) September 28, 2021 -
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు పోటాపోటీగా పాల్గొంటున్నాయి. అదేవిధంగా ప్రచారంలో ఆప్, బీజేపీ చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో బాదర్పూర్ నియోజకర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ దత్ శర్మపై బుధవారం దాడి జరిగింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి జరగటం ఢిల్లీలో చర్చనీయ అంశంగా మారింది. నారయణ్ దత్ శర్మ తన కారులో పార్టీ మీటింగ్‌కు హాజరై తిరిగి వస్తుండగా పదిమంది గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పగిలి మీద పడటంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ దత్.. తన రాజకీయ ప్రత్యర్థులు ఈ దాడి చేయించారని ఆరోపించారు. కాగా, ఇటీవల ఆయన ఆప్ నుంచి బయటకు వచ్చి బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బాదర్పూర్ నియోజకవర్గంలో ఆప్ ఆయనకు టికెట్ నిరాకరిచంటంతో బీఎస్పీలో చేరినట్లు తెలుస్తోంది. -
‘50 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారు’
భోపాల్: తమ పార్టీలో చేరితే రూ.50 కోట్లతో పాటు మంత్రి పదవినీ కట్టబెడుతామని బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నదని మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరమని ఆ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నారని ఆమె వెల్లడించారు. డబ్బుకు ఆశపడ్డ వాళ్లు బీజేపీ ప్రలోభాలకు లొంగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తాను మాత్రం కమల్‌నాథ్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తానని, బీజేపీ గూటికి చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘మంత్రి పదవితో పాటు డబ్బు ఇస్తామని నాకు ఫోన్ కాల్ వచ్చింది. కానీ, నేను తిరస్కరించా. వారి నెంబర్స్ బ్లాక్ చేశాను’’ అని అన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపుతూ బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న తెలిసిందే. బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్కసీటు మినహా మిగతా వాటన్నింటినీ బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాంబాయి సంచలన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అస్థిరపరిచి ప్రభుత్వాలను ఏర్పాటుచేయాలని బీజేపీ ఆపరేషన్ కమల్‌కు శ్రీకారం చుడుతోన్న విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రల్లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గోడ దూసుతారోనని పార్టీ నేతలకు భయం పట్టుకుంది. -
అమ్మాయిల ఫొటోలు చూస్తూ కెమెరాలకు బీఎస్పీ ఎమ్మెల్యే
యశవంతపుర (బెంగళూరు): కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సోమవారం శాసనసభలో చర్చ జరుగుతుండగా, బీఎస్పీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.మహేశ్ తన మొబైల్లో అమ్మాయిల ఫోటోలను వీక్షిస్తూ కెమెరాలకి చిక్కారు. సభ ప్రారంభానికి ముందు సభలోకి వచ్చి కూర్చున్న మహేశ్ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌లో అమ్మాయిల ఫోటోలను చూడసాగారు. సభలో సభ్యులు మాట్లాడుతుండగా మహేశ్ ఫోన్లోనే నిమగ్నమయ్యారు. గతంలో బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సభలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. ఫోన్ల వినియోగానికి ప్రత్యేక గదిని కేటాయించారు. నిషేధం ఉన్నప్పటికీ మహేశ్ సభలోకి ఫోన్ తీసుకురావడం వివాదాస్పదమైంది. అయితే, తన కొడుకుకు వధువును వెతికే ప్రయత్నాల్లో భాగంగా ఓ మిత్రుడి పంపిన అమ్మాయిల ఫొటోలను తాను అసెంబ్లీలో చూశానని, ఈ విషయంలో దురుద్దేశాలు ఆపాదించరాదని, ఆ ఫొటోలను టీవీల్లో చూపించి.. వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఎమ్మెల్యే మహేశ్ మీడియాను కోరారు. -
ఎమ్మెల్యే పేపర్ మిల్లులో అత్యాచారం, హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కు చెందిన మిల్లులో ఓ దళిత మహిళ అత్యాచారం, హత్యఘటన కలకలం రేపింది. ముజఫర్ నగర్ లో ని పేపర్ మిల్లు లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందిన పేపర్ మిల్లులో పనిచేసే దళిత కార్మికురాలు (38) అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ముజఫర్ నగర్ లోని జనసాత్ లో వున్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న దళిత మహిళ శుక్రవారం శవమై తేలింది. ఇది బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందినదనీ, ఆమెపై అత్యాచారం చేసిన గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ కోసం గాలిస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్యే ను తాళ్లతో కట్టేశారు!
-
ఎమ్మెల్యే ను తాళ్లతో కట్టేశారు!
చాందౌలీ(యూపీ): బబ్బన్ సింగ్ చౌహాన్..ఆయనొక ఎమ్మెల్యే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఘాల్ సారాయ్ నియోజవర్గం నుంచి ఎన్నికైన బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)కి చెందిన ప్రజాప్రతినిధి. అయితే ప్రజా సమస్యలు తెలుసుకుందామని శనివారం చాందౌలీ గ్రామంలో మూడో వార్డుకు వెళ్లారు. ఇక్కడ ఆయనకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహించిన గ్రామస్తులు ఆ సదరు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ప్రధానంగా గ్రామంలో నిత్యవసరమైన తాగు నీరు, విద్యుత్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాతమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర ఆందోళన చేపట్టారు. అంతటితో ఆగకుండా ఆ ఎమ్మెల్యేను, కౌన్సిలర్ ను కూడా నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి తమ సమస్యకు ఇక్కడే పరిష్కారం చెప్పాలంటూ నిలదీశారు. 'మీరు గతంలో రూ.80లక్షల నిధులు తమ గ్రామానికి మంజూరు అయినా.. ఇప్పటివరకూ ఎటువంటి పనులు ఎందుకు చేపట్టలేదంటూ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై తుదికంటూ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేను, కౌన్సిలర్ ను తాళ్లతో కట్టేసిన సమాచారం అందుకున్న ఎస్పీ మునిరాజ్ అక్కడకు హుటాహటీనా వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి ఆ ఎమ్మెల్యేను, కౌన్సిలర్ ను గ్రామస్తుల నిర్బంధం నుంచి విడిపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారని.. దీనిలో భాగంగానే వారిని బంధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే బబ్బన్ సింగ్ చౌహాన్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఎస్పీ స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యేను కట్టేసిన ప్రజలు!