బబ్బన్ సింగ్ చౌహాన్..ఆయనొక ఎమ్మెల్యే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఘాల్ సారాయ్ నియోజవర్గం నుంచి ఎన్నికైన బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)కి చెందిన ప్రజాప్రతినిధి. అయితే ప్రజా సమస్యలు తెలుసుకుందామని శనివారం చాందౌలీ గ్రామంలో మూడో వార్డుకు వెళ్లారు. ఇక్కడ ఆయనకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహించిన గ్రామస్తులు ఆ సదరు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ప్రధానంగా గ్రామంలో నిత్యవసరమైన తాగు నీరు, విద్యుత్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాతమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర ఆందోళన చేపట్టారు.
Published Mon, Jul 20 2015 7:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement