
భోపాల్: ప్రజలు స్వచ్ఛందంగా లంచం ఇస్తే తీసుకోవాలనే గానీ, బలవంతంగా వసూలు చేయడం తగదంటూ అధికారులకు ఓ ఎమ్మెల్యే చెప్పడం వివాదాస్పదంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)ఎమ్మెల్యే రాంబాయి సింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దామోహ్ జిల్లా పథారియా నియోజకవర్గం సతావువా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాయి పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధి పొందేందుకు తా
చదవండి: నిజం కోసమే నా పోరాటం: నవజోత్ సింగ్ సిద్ధూ
దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని వారికి సూచించారు. ప్రజలు రూ.500, రూ.1,000.. ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ, వారివద్ద ఉన్నదంతా లాగేసుకోవాలని చూడటం తగదని హితవు పలికారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపించి, లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దామోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాంబాయి సింగ్ సమర్థించుకున్నారు. సతావువా గ్రామ నిరుపేదలు ఎంత కష్టపడినా నెలకు రూ.6వేలు సంపాదించడం కష్టమని తెలిపారు. అటువంటి వారు ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ రూ.10 వేల చొప్పున బలవంతంగా రాబట్టాలని చూడటం తగదని తాను చెప్పానన్నారు.
చదవండి: పళ్లు ఊడిపోయాయని ఏకంగా ప్రధాని మోదీకే లెటర్, వైరల్
म.प्र: दमोह जिले के पथरिया की महिला विधायक रामबाई का यह वीडियो इस समय वायरल हो रहा है। रामबाई वही हैं जिनके पति पर हत्या का आरोप है। समय-समय पर उनके अपने क्षेत्र के लोगों की समस्या के निराकरण के दौरान उऩके संवादों के वीडियो वायरल होते रहते हैं #ViralVideo pic.twitter.com/TAcb6x65FT
— Hindustan (@Live_Hindustan) September 28, 2021