తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా కావాలనే టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు కట్టి, ర్యాలీలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎంలు వెళ్లే రూట్స్‌లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొడుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ లాంటి నాయకులకు ప్రధాని మోదీ పాపులారిటీ గురించి ఏం తెలుసు..?. తెలంగాణ సర్కార్ రూ. 2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. ప్రభుత్వం ఆ డబ్బులను కేసీఆర్ కుటుంబానికి తరలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ విహారయాత్ర చేసుకోవచ్చు’’ అని అన్నారు.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రధాని మోదీ భయం పట్టుకుంది. తెలంగాణ ప్రజలను తప్పుడు హామీలతో కేసీఆర్ మోసం చేశారు’’ అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: హెచ్‌ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment