BJP Chief Kishan Reddy's Key Comments Over PM Modi Warangal Tour - Sakshi
Sakshi News home page

మోదీ వరంగల్‌ పర్యటన.. కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published Fri, Jul 7 2023 4:18 PM | Last Updated on Fri, Jul 7 2023 5:06 PM

BJP Chief Kishan Reddy Key Comments Over PM Modi Warangal Tour - Sakshi

సాక్షి, వరంగల్‌: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(శనివారం) వరంగల్‌ జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలోని మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. 

కాగా, సభా ప్రాంగణంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన వరంగల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి వస్తున్నారు. రూ.6,109 కోట్లతో జాతీయ రహదారులకు, రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుప్యాక్షరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఫస్ట్ ఫేజ్‌లో 521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుప్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో, మూడువేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 

రేపు ప్రధాని మోదీ మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఫస్ట్ వరంగల్‌కు వస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల అనంతరం విజయ సంకల్ప సభ ముఖ్యమైనది. 
కొందరు.. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏవిధంగా పోరాడుతున్నామో మోదీ వివరిస్తారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడేలా బీజేపీ కృషి చేస్తుంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్‌కు పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం కమిషన్లు, వాటాల ప్రభుత్వంగా మారింది. నిజమైన నీతివంతమైన పాలనను తెలంగాణలో తీసుకువస్తాం. బీజేపీ ఏనాడూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో కలిసిన దాఖలాలు లేవు. ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశారు. ప్రభుత్వాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బొమ్మా బొరుసు లాంటివి. ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే అంటూ విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నది ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement