సాక్షి, వరంగల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలల తెలంగాణ పర్యటనకు విచ్చేయనున్న విషయం తెలిసిందే. జూలై 8న వరంగల్‌కి రానున్నారు. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓవర్‌హాలింగ్ సెంటర్, మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ క్రమంలో రేపు(ఆదివారం) వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించనున్నారు. అయితే కొంతకాలంగా ఎడముహం, పెడముఖంగా ఉంటున్న కీలక నేతలు.. ప్రధాని పర్యటనలో అయినా కలిసి పనిచేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అదే విధంగా మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ పీవోచ్ శంఖుస్థాపన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బహిరంగ సభ కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం, ఓ సిటీ గ్రౌండ్‌ను బీజేపీ నాయకులు పరిశీలించనున్నారు, ఇప్పటికే రెండు చోట్ల పర్మిషన్ కోసం బిజేపి నాయకులు దరఖాస్తు చేశారు. తన వరంగల్ పర్యటనలో భాగంగా మోదీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. , అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
చదవండి: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment