Kishan Reddy Key Comments Over PM Modi Visit To Warangal - Sakshi
Sakshi News home page

కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్‌ హైవే: కిషన్‌రెడ్డి

Published Sun, Jul 2 2023 1:51 PM | Last Updated on Sun, Jul 2 2023 3:07 PM

Kishan Reddy Key Comments Over PM Modi Visit To Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదు అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యత ప్రభుత్వానిదే. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. 

కాగా, కిషన్‌రెడ్డి వరంగల్‌ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన వరంగల్‌కు రానున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటిసారిగా కాకతీయులు ఏలిన గడ్డమీదకి వస్తున్నారు. భద్రకాళి అమ్మవారిని మోదీ దర్శించుకుంటారు. చాలా రోజులుగా మోదీ రావాలని కోరుతున్నాం. ఇప్పుడు వస్తున్నారు. మౌళిక వసతులకు కేంద్రం పెద్దపీట వేస్తుంది. వరంగల్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీ అమృత్‌ నగరంగా అభివృద్ధి చేస్తున్నాం. వెయ్యి స్తంభాల గుడిలో కళ్యాణ మంటపాన్ని పూర్తిస్థాయిలో మోదీ ఆదేశంతో పునఃనిర్మిస్తున్నాం.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు..
రైల్వే వ్యాగన్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికైనా కేసీఆర్‌ సర్కార్‌ స్పందిస్తే సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. గిరిజన వర్సిటీ విషయంలో కేంద్రం వెనకడుగు వేయదు. జాతీయ రహదారులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టు ఐదారు జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ 26 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున భాగస్వామ్యంతో ఆర్‌ఆర్‌ఆర్ ఏర్పాటు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా భూసేకరణ చేసి నేషనల్ రోడ్డు అథారిటీకి అప్పగిస్తే పనులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భూసేకరణ పూర్తి చేయాలని కోరుతున్నాం. ఆర్ఆర్ఆర్‌కు అనుసంధానంగా ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని సంకల్పించాం. దేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించి సర్వే చేయించాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేయాలని కోరుతున్నాం. యాదాద్రి వరకు 330 కోట్లతో ఎంఎంటీఎస్ ట్రైన్‌ను పొడిగించాలని నిర్ణయించాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకున్నా 1200 కోట్లతో ఎంఎంటీఎస్-2ఫేజ్‌ను చేపట్టబోతున్నాం. 

కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్‌ హైవే..
వరంగల్ అనుసంధానంతో నేషనల్ హైవేను రూ. 5587 కోట్లతో 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేస్తారు. కరీంనగర్-వరంగల్ జిల్లాలను అనుసంధానం చేసే ఫోర్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి రూ.69 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. స్వార్థ రాజకీయాల కోసం అసత్య ప్రచారం చేయవద్దని కోరుతున్నాం. తెలంగాణ అభివృద్ధికి ఇతర రాష్ట్రాలతో పోల్చితే భిన్నంగా ఉంది అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ జనగర్జన సభ: ఖమ్మంలో ఉద్రిక్తత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement