
ఠాకూర్ క్షమాపణను అంగీకరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ వ్యవహారంలో భేషరతుగా క్షమాపణ కోరుతూ బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు ఆమోదించింది. గతంలో ఆయన కోర్టుకు తప్పుడు ప్రమాణపత్రం సమర్పించినందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుం దని, భేషరతుగా క్షమాపణ చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే కోర్టు సూచన మేరకు శుక్రవారం ఆయన స్వయంగా హాజరయ్యా రు. దీంతో ఠాకూర్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును కోర్టు ఉపసంహరించుకుంది. మరోవైపు పరిపాలక కమిటీకి రామచంద్ర గుహ, విక్రమ్ లిమయే చేసిన రాజీనామాలను కోర్టు ఆమోదించింది.