'భారత్ క్రికెట్కు నీ అవసరం ఉంది' | Need you back in Indian Cricket, says Sourav Ganguly to ex-BCCI chief Anurag Thakur | Sakshi
Sakshi News home page

'భారత్ క్రికెట్కు నీ అవసరం ఉంది'

Published Mon, Jul 10 2017 11:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

'భారత్ క్రికెట్కు నీ అవసరం ఉంది'

'భారత్ క్రికెట్కు నీ అవసరం ఉంది'

న్యూఢిల్ల్లీ:భారత క్రికెట్ కంట్రోలో బోర్డు(బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తిరిగి మళ్లీ భారత్ క్రికెట్ లోకి రావాలని సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. భారత్ క్రికెట్ కు అనురాగ్ అవసరముందని పేర్కొన్న గంగూలీ.. మళ్లీ భారత్ క్రికెట్ పరిపాలనలో ఆయన్ను చూస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. గత రెండు రోజుల క్రితం సౌరవ్ గంగూలీ 45వ పుట్టినరోజు సందర్బంగా అనురాగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'డియర్ గంగూలీ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నీకు ఇదొక మంచి సమయం. యువ క్రికెటర్లకు నీవు మరింత ఆదర్శవంతంగా ఉండాలి'అంటూ అనురాగ్ ట్వీట్ చేశాడు. దానికి గంగూలీ బదులిస్తూ.. థాంక్యూ యూ అనురాగ్, నీవు భారత క్రికెట్ లోకి తిరిగి వస్తావని అనుకుంటున్నా. నీ అవసరం  భారత క్రికెట్ కు ఉంది'అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ఏడాది జనవరిలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా లోధా కమిటీ సిఫారుసులో వెనుకడుగు వేసిన అనురాగ్ ను సుప్రీంకోర్టు తప్పించింది. దాంతో భారత్ క్రికెట్ వ్యవహారాలకు అనురాగ్ ఠాకూర్ దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం  సుప్రీంకోర్టు నియమించిన వినోద్ రాయ్ నేతృత్వంలోని పరిపాలక కమిటీ భారత క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement