ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ బరిలోకి దిగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని... ఈ మెగా ఈవెంట్ సన్నాహాలపై ఆతిథ్య చైనా దేశం నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకవేళ కరోనా కేసులు నియంత్రణలోకి రాకపోతే మాత్రం ఆసియా క్రీడలు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment