సినిమా రంగంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. తాజాగా ఈ అవార్డుకు బాలీవుడ్ సీనియర్ నటి పేరును ప్రకటించింది కేంద్రం. సీనియర్ నటి ఆశా పరేఖ్‌ను 2020 ఏడాదికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆమెను 1992లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
(చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆదిపురుష్ రిలీజ్ డేట్ చెప్పేసిన డైరెక్టర్)
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్‌కు ఇవ్వడం సంతోషకరం. ఆమె సుమారు 95 చిత్రాలలో నటించారు. 1998-2001 వరకు సీబీఎఫ్‌సీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డుతో సత్కరిస్తాం' అని అన్నారు. హేమా మాలిని, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణ, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లేలతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆమె పేరును నామినేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment