dadasaheb phalke award
-
రాజ్‌కపూర్ శతజయంతి : జీనా ఇసీకా నామ్ హై!
జన్మించి నూరేళ్లు. మరణించి ముప్పై ఆరేళ్లు. మొదటి సినిమా ‘ఆగ్’ వచ్చి 75 ఏళ్లు. ఇవాళ్టికీ రష్యా వెళితే వినిపించే పాట ‘ఆవారా హూ’... చైనాలో పలికే భారతీయ నటుడి పేరు రాజ్ కపూర్. ‘ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియా’. మేరా జూతా హై జపానీ పంట్లూన్ ఇంగ్లిస్తానీ... కాని మనసు? ‘ఫిర్ భి దిల్ హై హిందూస్తానీ’. ఉత్సవంలా బతికి ఉత్సవంలా మరణించినవాడు రాజ్ కపూర్. ‘జీనా యహా.. మర్నా యహా’ సినిమాను ప్రేమించి పులకించినవాడు. అతనికి నివాళి. ఘన స్మరణ.మే 2, 1988.న్యూదిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియమ్... జాతీయ పురస్కారాల ప్రదానం. హాలు కిక్కిరిసి ఉంది. ప్రభుత్వ, సినీ రంగ పెద్దలు ఆసీనులై ఉన్నారు. వేదిక మీద రాష్ట్రపతి ఒక్కొక్కరి పేరు పిలిచి పురస్కారాలు అందిస్తున్నారు. ‘ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార బహూకరణ. గ్రహీత– రాజ్ కపూర్’. ఆ పేరు వినగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ వేదిక మీదకు రాబోతున్న రాజ్ కపూర్ కోసం చూస్తున్నారు. కాని ముందు వరుసలో ఉన్న రాజ్ కపూర్ కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కొన్ని నిముషాల ముందే ఆయనకు ఆస్తమా అటాక్ వచ్చింది. అలా రాకూడదని రెండు గంటల ముందు హోటల్లో ఇంజెక్షన్ చేసుకొని వచ్చారు. అయినా వచ్చింది. సభలో ఉన్నవారి ఎదురు చూపు. లేవలేని తన అశక్తత. మాట పెగలట్లేదు. కాని కళ్లు పని చేస్తున్నాయి. కళాకారుడి కళ్లు అవి. ‘నేను వేదిక మీదకు రాలేను రాష్ట్రపతి గారూ’... కళ్లతోనే మొర పెట్టుకున్నారు రాజ్ కపూర్. వేదిక మీద ఉన్న రాష్ట్రపతి కె.వెంకట్రామన్ ఆ కళ్లలోకి చూసి సంగతి గ్రహించారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండా స్వయంగా తానే వేదిక దిగి రాజ్ కపూర్ వైపు కదిలారు. ఆయన వస్తుంటే శక్తినంతా కూడగట్టుకుని రాజ్‌కపూర్ లేచి నిలబడ్డారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం’ సగౌరవంగా ఆయనకు దక్కింది. రాష్ట్రపతిని స్జేజ్ మీద నుంచి కిందకు వచ్చేలా చేసిన సంఘటన మరొకటి లేదు. రాజ్ కపూర్ మాత్రం? అలాంటి వాడు మరొకడున్నాడా ఏమిటి?1955.జవహర్లాల్ నెహ్రూ ‘సోవియెట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా’ను ప్రధాని హోదాలో సందర్శించారు. ఇరు దేశాల మధ్య స్నేహం వెల్లివిరుస్తున్న సమయం. రష్యన్లను, స్థానిక భారతీయులను ఉద్దేశించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడే సభ. ముందు నెహ్రూ మాట్లాడి జనాన్ని ఉత్సాహ పరిచి కూచున్నారు. నెహ్రూ గొప్ప వక్త. రష్యా ప్రధాని నికొలాయ్ బల్గనిన్కు నెహ్రూని మించి సభను రక్తి కట్టించాలనిపించింది. తన మంత్రులకు సైగ చేశారు. వాళ్లంతా వచ్చి బల్గనిన్ ఇరు పక్కలా నిలుచున్నారు. నెహ్రూకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా రష్యా ప్రధాని, మంత్రులు పాట అందుకున్నారు.ఆవారా హూ... ఆవారా హూ..యా గర్దిష్ మే హూ ఆస్మాన్కా తారాహూ ఆవారాహూ...జనం కేరింతలు. నెహ్రూ ఉన్న సభ అది. మార్మోగుతున్నది రాజ్ కపూర్ పేరు. ‘ఉదయాన్నే తెల్లబట్టలు వేసుకొని వెళ్లాలి. సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయి రావాలి’ అని చెప్పాడు పృథ్వీరాజ్ కపూర్ తన పెద్ద కొడుకు రాజ్ కపూర్‌ని రంజిత్ స్టూడియోలో పనిలో పెట్టి. మెట్రిక్యులేషన్ తర్వాత ‘ఇక చదవను సినిమాల్లో పని చేస్తా’ అని రాజ్ కపూర్ కోరడంతో సినిమా తీయాలంటే అన్ని పనులు తెలియాలి అని స్టూడియో పనిలో పెట్టి పృథ్వీరాజ్ కపూర్ అన్న మాట అది. అప్పటికే ప్రాభవంలో ఉన్న నటుడి కొడుకైనప్పటికీ రాజ్ కపూర్ ఒక ఆర్డినరీ క్లాప్ బాయ్‌లానే జీవితాన్ని మొదలుపెట్టాడు. రంజిత్ స్టూడియో, బాంబే టాకిస్, ఫిల్మ్స్థాన్... వీటన్నింటిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి చివరకు తండ్రి దగ్గరే పృథ్వీ థియేటర్లో చేరితే పది రూపాయల జీతం, రెండు జతల బట్టలు, వానాకాలంలో ఉచితంగా వాడుకోవడానికి రైన్ కోట్, టోపీ దక్కాయి. రాజ్ కపూర్ అలా రాజ్ కపూర్ అయ్యాడు. తెల్లబట్టలు నల్లగా పీలికలయ్యేంతగా కష్టపడ్డాడు. కష్టం చేసేవాడిని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఈ నీలికళ్ల అందగాడిలో ఏదో ఉంది అని దర్శకుడు కేదార్ శర్మ రాజ్ కపూర్‌తో హీరోగా అతని మొదటి సినిమా ‘నీల్ కమల్’ తీశాడు. హీరోయిన్ పదమూడేళ్ల మధుబాల. ఆడలేదు. అయితే సినిమాల్లో ఫస్ట్ టేక్ ఓకే కాకపోతే రీటేక్ చేయొచ్చు. రీటేక్ కోసం మరింత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోనివాడు పోతాడు. రాజ్ కపూర్ పడి లేవడం తెలిసినవాడు.రాజ్ కపూర్‌కు పెళ్లయ్యింది (1946). ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకూడదని తానే ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా ‘ఆగ్’ (1947) తీశాడు. ఏంటి... మూతి మీద సరిగా మీసాలు కూడా రాని కుర్రాడు సినిమా తీయడమా.. ‘ఆగ్’ (మంట) అని టైటిలా? సీనియర్ డిస్ట్రిబ్యూటర్లకు ఒళ్లు మండింది. రాజ్ కపూర్ కనపడితే ‘ఏమయ్యా రాజ్. అన్నీ నువ్వే అయ్యి సినిమా తీస్తున్నావ్. సినిమా హాలు కూడా కట్టుకోరాదూ?’ అన్నారు. ‘హాలెందుకు?’ అనడిగాడు రాజ్ కపూర్. ‘ఎందుకేంటయ్యా. మంట అంటుకుంటే నీ హాలు బూడిదైతే చాలదా? మావన్నీ ఎందుకు?’ అన్నారు. హేళన అలా ఉంటుంది. ‘ఆగ్’ విడుదలైంది. ఓ మోస్తరుగా ఆడింది. నవ్వులు ఆగాయి. రాజ్‌కు తెలుసు... ఈ ప్రయత్నాలన్నీ అడ్డ పెడలు వేసి సైకిలు తొక్కడమేనని. సీటెక్కి తొక్కే సమయానికి తోటి కుర్రాళ్లు తోడవుతారని. అయ్యారు. కె.ఏ. అబ్బాస్ (రచయిత), శంకర్ జైకిషన్ (సంగీత దర్శకులు), ముకేష్ (గాయకుడు), శైలేంద్ర– హస్రత్ జైపూరి (గీత కర్తలు)... వీళ్ల తోడుగా రాజ్ కపూర్ మరో సినిమా తీశాడు. విడుదలైంది.బర్సాత్ (1949). భారీ హిట్. రాజ్ కపూర్ అట... నర్గిస్ అట... పదండి హాళ్లకు... కలుద్దాం వీళ్లను... థియేటర్లలో మంట అంటుకుంది... కలెక్షన్ల మంట... కాసుల మంట.... అగ్గితో కురిసే కుంభవృష్టి.రాజ్‌కపూర్ టీమ్‌కు ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు తోడయ్యారు. నర్గిస్, లతా మంగేష్కర్. ‘బర్సాత్’ లో నర్గిస్, రాజ్ కపూర్. ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు చేశారు. ఆవారా, ఆహ్, శ్రీ 420, చోరి చోరి.... కేవలం వినోదం రాజ్ కపూర్ ఉద్దేశం కాదు. కథ ఉంటుంది. జనం తమ కథే అనుకునే కథ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆనాటి రోజుల్లో అగమ్యంగా ఉన్న పేదవాళ్లు, ఎవరికీ పట్టని బీదలకు ప్రతినిధిగా కథానాయకుణ్ణి పెట్టి ‘ఆవారా’ తీశాడు. పని దొరక్క ఉపాధి కోసం వలసకు బయలుదేరి గ్రామీణ నిష్కల్మషం నుంచి నగర పతనాలకు ప్రయాణిస్తూ నైతిక ఘర్షణను ఎదుర్కుంటున్న యువకులకు ప్రతినిధిగా హీరోని పెట్టి ‘శ్రీ420’ తీశాడు. చార్లి చాప్లిన్‌ను పోలిన ఆహార్యం, చలాకీతనం, అమాయకత్వం.. తోడుగా వ్యక్తిత్వం ఉన్న పాత్రల్లో నర్గిస్... ఆ జంట పండింది. క్లాసిక్స్ అందరూ తీస్తారు. కాని కొందరు వాటితో అందరినీ తాకుతారు. సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో భాగంగా రష్యాలో సినిమాల విడుదలకు మన దేశం అనుమతించింది. వాటిలో ప్రధానమైనవి రెండు: ‘దో భిగా జమీన్’ (బిమల్ రాయ్ – 1953), ఆవారా (1951). మాస్కోలో మన ప్రభుత్వం పూనికతో ‘దో భిగా జమీన్’ పోస్టర్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే రష్యన్లు అలాంటి సినిమాలను మెచ్చుతారని. ఒక్కరోజు. రష్యన్లు దో భిగా జమీన్, ఆవారా రెండూ చూశారు. రాత్రికి రాత్రి అంతా మారిపోయింది. మాస్కో అంతా ఎక్కడ చూసినా ఆవారా పోస్టర్లే. 4 రోజుల్లో 15 లక్షల మంది మూడు నగరాల్లో చూశారు. అదీ రాజ్‌కపూర్. రాజ్ కపూర్ ఏది చేసినా పెద్దగా ఆలోచించి చేసేవాడు. అతడు సన్నివేశాన్ని ముందు సంగీతంతో ఊహిస్తాడని అంటారు. సంగీతం ఇలా ఉంటే సన్నివేశం అలా తీయొచ్చు అనుకుంటాడట. ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్సు, ‘శ్రీ 420’లో ‘΄్యార్ హువా ఇక్రార్ హువా’ పాటకు వేసిన సెట్.. సినిమా అంటే విజువల్స్... మ్యూజిక్.... ఇవి రెండు బెస్ట్‌గా ఉంటే సినిమా హిట్. ‘సంగం’కు ఇంకో ఆకర్షణ అమర్చాడు– లొకేషన్స్. విదేశీ లొకేషన్లలో తీసిన మొదటి హిందీ సినిమా అది. భారీ హిట్. ఆ తర్వాతి రోజుల్లో యశ్ చోప్రా ఫార్ములాను స్థిరపరిచాడు. రాజ్‌కపూర్ గొప్పగా కలగని... కాలం కంటే ముందుకెళ్లి రెండు ఇంటర్వెల్స్తో తీసిన ‘మేరా నామ్ జోకర్’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమాలో మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. కౌమార స్థితిలోని రిషి కపూర్, అతని టీచర్‌గా సిమి గెరెవాల్... వీరి ఎపిసోడ్ ఫ్రెంచ్ సినిమాకు తగ్గదని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌ను కొనసాగిస్తూ, ‘మేరా నామ్ జోకర్’ను ఫ్లాప్ చేసినందుకు ప్రేక్షకుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ రాజ్ కపూర్ తీసిన సినిమాయే ‘బాబీ’. ఈ టీనేజ్ లవ్ స్టోరీ నేటికీ వందల భారతీయ సినిమాలకు కథను అందిస్తూనే ఉంది. రాజ్ కపూర్ ప్రకృతిలోని, మగాడిలోని, స్త్రీలోని స్త్రీత్వాన్ని గొప్పగా పట్టించుకున్న దర్శకుడు. స్త్రీ పురుషుల భావోద్వేగాలను, వీటిని ప్రేరేపించే లేదా నియంత్రించే సాంఘిక పరిమితులు, నియంత్రణలు... వీటినే అతడు ఎక్కువగా కథాంశాలు తీశాడు. అయితే మార్పు గురించి తన తాపత్రయం ఒదులుకోలేదు. ‘జాగ్తే రహో’, ‘బూట్ పాలిష్’, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’, ‘దిల్లీ దూర్ నహీ’, ‘సత్యం శివమ్ సుందరం’, ‘ఈ దేశంలో బీదవాళ్లు ఎక్కువ. వారు బాగు పడితే దేశం బాగు పడినట్టే’ అని రాజ్ కపూర్ అంటారు.ఉజ్వలమైన కాలాన్ని చరిత్రలో నుంచి తుడిచి పెట్టడం అసాధ్యం. జనులు మెచ్చిన కళాకారుణ్ణి సాంస్కృతిక పుటల్లో నుంచి చెరిపివేయడం దుస్సాధ్యం. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ అతని సరిజోడిగా గొప్ప ప్రతిభ చాటారు. కాని రాజ్ కపూర్ సినిమానే తన జీవితం చేసుకున్నాడు. సినిమా నుంచి పొందాడు. సినిమాకు ఇచ్చాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గొప్ప సంగీత సాహిత్యాలకు వారధిగా... దేదీప్యంగా నిలిచిన స్ఫూర్తిగా... ఇలా మరొకరు లేరు.అందుకే రాజ్ కపూర్ శత జయంతి ముగింపును దేశమంతా సగౌరవంగా జరుపుకుంటోంది. రాజ్ కపూర్‌ను గుర్తు చేసుకోవడం ద్వారా తన సినీ సౌందర్యాన్నీ, సినీ రసాత్మకతను గుర్తు చేసుకుంటోంది. ఒక పూట వెచ్చించి రాజ్ కపూర్ సినిమాలు చూసినా, పాటలు విన్నా జీవిత కాలం అంటిపెట్టుకొని పోయే ప్రియమైన కళాకారుడతడు. మళ్లీ మళ్లీ పుట్టడు. అతని కాలంలో మనం ఉన్నాం. అతని శత జయంతి ముగింపులోనూ ఉన్నాం. ఎంత సంతోషం. ఈ ఘనత కొనసాగాలి. ది షో మస్ట్ గో ఆన్.జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జనా కహా. -
దాదాకు ఫాల్కే
బాలీవుడ్లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్‌స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డాన్స్‌ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్’తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్‌స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్’ బ్రాండ్‌తో హోటెలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్‌దా’! దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే!! నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్‌సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.∙∙ మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్ కోల్‌కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్‌మయ్ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.∙∙ మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్‌గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్‌కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.∙∙ ‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికే రజనీకాంత్‌ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్‌ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్ సూపర్‌స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్ ఎలా హీరో అవుతాడు? ∙∙ కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్’ అన్నాడు బి.సుభాష్. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్’ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్ ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్‌తోనే తీసిన ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్‌కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.∙∙ మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్ అవార్డ్ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా తీసిన ‘΄్యార్ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా నచ్చాయి. ∙∙ మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ ‘అగ్నిపథ్’లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్ షోస్ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.∙∙ ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్‌బ్యాక్ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్‌బ్యాక్’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ . కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా1996 డిసెంబర్ 1న కోల్‌కతాలో న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.నవ్వలేను...సంతోషంతో ఏడవలేను‘దాదాసాహెబ్ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్‌పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. -
మిథున్ చక్రవర్తిని వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్'
భారత చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈ ఏడాది బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో మిథున్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది. 1976లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన మిథున్ తొలి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన సినీ కెరియర్లో మొత్తం మూడు నేషనల్ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు. తెలుగులో గోపాల గోపాల సినిమాతో టాలీవుడ్‌కు మిథున్ చక్రవర్తి పరిచయం అయిన విషయం తెలిసిందే.'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే వెంటనే మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తారు. సుమారు 45 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకుని. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా మిథున్ చేశారు.మిథున్‌తో నటించేందుకు ఓకే చెప్పిన తొలి హీరోయిన్ జీనత్ అమన్మిథున్ సినీ జర్నీలో మొదట పెద్ద హీరోయిన్స్ తన వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అలా ఏ ఒక్క హీరోయిన్ కూడా ఆయనతో కలిసి నటించడానికి ఇష్టపడేవారు కాదు. ఒకరకంగా చెప్పాలంటే తనను హీరోగానే వాళ్లు చూడలేదు. ఆయనతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా అలాంటి సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని మిథున్ సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి తన కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. ఈ వషయాన్ని కూడా ఓ వేదిక మీదు మిథున్ చక్రవర్తి పంచుకున్నారు.మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఆయన నటించారు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. బాలీవుడ్లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత సాధించిన మిథున్.. తన కెరియర్లో సుమారు 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. గతేడాదిలో 'కాబులివాల' అనే బెంగాళి చిత్రంలో ఆయన నటించారు. -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనపై కంగనా అసహనం
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లోకి ఎక్కుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ మాటల దాడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నిర్వహకులపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ అవార్డు కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతం చూపించారని కంగనా మండిపడింది. కాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహేబ్ ఫాల్కే’ అవార్డు ఒకటి. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి నిన్న (సోమవారం) రాత్రి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. 2023కి గానూ పలువురు సినీ తారల సమక్షంలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర) ఉత్తమ నటిగా ఆలియా భట్(గంగూబాయ్ కథియవాడి) చిత్రాలకు గానూ అవార్డును అందుకున్నారు. అలాగే కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా ఈ అవార్డును దక్కింది. చదవండి: నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఎంటంటే! ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’, ఫిలిం ఆఫ్ ది ఇయర్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు అవార్డును గెలుచుకున్నాయి. అయితే రణ్‌బీర్ కపూర్, ఆలియాలకు ఈ అవార్డు రావడంపై కంగనా తప్పుబట్టింది. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్‌కు అవార్డులు దక్కాయని విమర్శించింది. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ తన ట్విటర్లో ఓ జాబితాను పంచుకుంది. అనంతరం బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదని, అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా పేర్కొన్నా జాబితా ఇలా ఉంది బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతార) బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ ఠాకూర్ (సీతారామం) ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్) ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా) Best director- SS Rajamouli ( RRR) Best supporting actor- Anupam Kher ( Kashmir Files) Best supporting actress- Tabu ( Drishyaman/Bhool Bhulaiya) Bolly awards are a big sham … when I get some time from my schedule I will make a list of all those I feel are deserving … thanks — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 -
బాలీవుడ్ నటికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రకటించిన కేంద్రం
సినిమా రంగంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. తాజాగా ఈ అవార్డుకు బాలీవుడ్ సీనియర్ నటి పేరును ప్రకటించింది కేంద్రం. సీనియర్ నటి ఆశా పరేఖ్‌ను 2020 ఏడాదికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆమెను 1992లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. (చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆదిపురుష్ రిలీజ్ డేట్ చెప్పేసిన డైరెక్టర్) కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్‌కు ఇవ్వడం సంతోషకరం. ఆమె సుమారు 95 చిత్రాలలో నటించారు. 1998-2001 వరకు సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డుతో సత్కరిస్తాం' అని అన్నారు. హేమా మాలిని, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణ, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లేలతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆమె పేరును నామినేట్ చేసింది. -
మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?
Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్ బహదూర్‌కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు. కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు? ‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్ చేసుకోవడం తప్పనిసరి. స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు. రజనీకాంత్ మరియు అతడు మొన్న ఢిల్లీలో రజనీకాంత్ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్‌తో పాటు స్నేహితుడు రాజ్ బహదూర్‌కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్‌కు బెంగళూరులో రాజ బహదూర్ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి. ‘నాలోని నటుణ్ణి రాజ్ బహదూర్ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి స్నేహం? 1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌గా ఉన్నాడు. బస్ కండక్టర్‌గా కర్ణాటక ఆర్.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్ నంబర్ 10 ఏ. మెజెస్టిక్ నుంచి శ్రీనగర్ స్టాప్ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్ రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్‌లో మంచి స్టయిల్ ఉండేది. ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్ బహదూర్ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్నగర్లోనే ఉంటున్నాడు. రజనీకాంత్ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు. స్నేహితుడే దారి రజనీకాంత్‌ను సినిమాల్లో చేరమని రాజ్ బహదూర్ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్ బహదూర్. ఆ రోజు ల్లో రాజ్ బహదూర్ జీతం 400. అందులో 200 రజనీకాంత్‌కు పంపేవాడు. రజనీకాంత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్ అయిన రోజులకు రాజ్ బహదూర్ పంపిన డబ్బే పెద్ద ఆధారం. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్‌కు కె.బాలచందర్ చీఫ్ గెస్ట్. ఆ టైమ్‌లో ఆయన రజనీకాంత్‌ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్ బహదూర్. కృష్ణ–కుచేల నిజానికి రజనీకాంత్ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్ బహదూర్ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్‌లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బహదూర్ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్టిసిలో రిటైర్ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్ బహదూర్ దగ్గర రజనీ కాంత్ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. రాజ్ బహదూర్ దానిమీద రజనీకాంత్ కింద నిద్రపోతారు. రజనీకాంత్ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్ ఒక్కోసారి రాజ్ బహదూర్ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు. కొనసాగే బంధం సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్ బహదూర్ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు. మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు. -
‘వాళ్లు..నా వాళ్లు..ఇది చరిత్ర’ : ఐశ్వర్య
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు. అందుకే రజనీకాంత్ కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసు కుంటోంది. ‘‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ధనుష్ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
రజిని దాదా
-
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్
Rajinikanth Receives Dadasaheb Phalke Award : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు గాను కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్ స్థానిక ఫోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ అవార్డును తాను ఊహించలేదన్నారు. ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్ లేకపోవడం బాధగా ఉందన్నారు. ఇక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. సోమవారం రెండు సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, అందులో ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనుండటం, రెండవది కూతురు సౌందర్య రజనీకాంత్ విశాకన్ హూట్ పేరుతో సోషల్ మీడియా యాప్ ప్రారంభించనుండటం అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ -
దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్).. విన్నర్స్ జాబితా
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా 2020 ఏడాదికిగాను దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డుల జాబితాను ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు సినీ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) పరిశ్రమ రంగాలు అవార్డులు అందుకున్నాయ. ఈ క్రమంలో టాలీవుడ్‌కు సంబంధించిన ఆరు కెటగిరిల్లో అవార్డులు వరించాయి. యువ నటుడు నవీన్ పోలిశెట్టి సౌత్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నందుకు గానూ నవీన్‌కు ఈ అవార్డు వరించింది. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ‘డియర్ కామ్రేడ్’లో అద్భుతమైన నటన ప్రదర్శించిన రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’కు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజీత్ ఉత్తమ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. అలాగే ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ హిట్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఎస్ఎస్ తమన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా హిందీకి సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 ప్రదానోత్సవాన్ని ఫిబ్రవరి 20 ముంబైలోని తాజ్ లాండ్స్ ఎండ్‌లో జరుపుబోతున్నారు. సౌతిండియా అవార్డుల ప్రదానోత్సవం తేదీని అతి త్వరలో తెలుపనున్నారు. కోలీవుడ్ నుంచి.. మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్- అజిత్ కుమార్ ఉత్తమ నటుడు- ధనుష్ ఉత్తమ నటి- జ్యోతిక ఉత్తమ దర్శకుడు- పార్థిబాన్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్- అనురుద్ద్ రవిచంద్రన్ మాలీవుడ్ నుంచి మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-మోహన్ లాల్ ఉత్తమ నటుడు -సూరజ్ వెంజరమూడు ఉత్తమ నటి- పార్వతీ తిరువోతు ఉత్తమ దర్శకుడు- మధు కె. నారాయణ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్- దీపక్ దేవ్ శాండల్‌వుడ్ నుంచి మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-శివరాజ్‌కుమార్ ఉత్తమ నటుడు - రక్షిత్ శెట్టి ఉత్తమ నటి- తాన్య హోప్ ఉత్తమ దర్శకుడు- రమేష్ ఇందిరా ఉత్తమ చిత్రం- మూకాజ్జియ కనసుగలు ఉత్తమ సంగీత దర్శకుడు- వి. హరికృష్ణ -
తొలి తరం నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబర్ 14న ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం. ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ తదితర చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకు ఎంతో వన్నె తెచ్చారు. సోనార్ ఖెల్లా, జోయ్ బాబా ఫెలునాథ్, ఘరె బైరె వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారాయన. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు ఛటర్జీ. వీటితో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారాయన. కాగా సౌమిత్ర ఛటర్జీ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. యస్–యస్–సక్సెస్ సౌమిత్ ఛటర్జీ అనగానే సత్యజిత్ రేతో ఆయనకున్న అనుబంధం గుర్తురాక మానదు. ప్రపంచ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్–డైరెక్టర్ కాంబినేషన్లలో ఈ ఇద్దరి పేర్లు తప్పక ప్రస్తావించాల్సిందే. సౌమిత్ర ఛటర్జీను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది సత్యజిత్ రేయే. రే తీస్తున్న ‘జల్సాగర్’ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లారట సౌమిత్ర. అప్పటికి ఆయనకు తెలియదు రే ఇచ్చే పెద్ద హిట్లలో హీరో వేషం తనే వేస్తానని, రే ఫ్యావరెట్ హీరో అవుతానని. ఆ చిత్రీకరణ చూడటానికి వెళ్లే సమయానికే సౌమిత్రను ‘అపుర్ సంసార్’ (1959) చిత్రానికి హీరోగా ఫిక్స్ అయ్యారు రే. ‘అపుర్..’ షూటింగ్ స్టార్ట్ అయ్యి, మొదటి సన్నివేశం తీసే వరకూ కూడా సౌమిత్రకు తన మీద తనకు నమ్మకం అంతగా లేదట. మొదటి షాట్ సింగిల్ టేక్‌లో ఓకే అయ్యాక నమ్మకం వచ్చింది. తన జన్మకారణం ఇదే (నటన) అని అర్థం అయిపోయింది. సౌమిత్ర ఛటర్జీ – సత్యజిత్ రే ఇద్దరూ కలసి సుమారు 14 సినిమాలు చేశారు. సౌమిత్రలోని నటుడిలో ఉన్న అన్ని కోణాలను సత్యజిత్ కథలు ఆవిష్కరించాయి. కొన్ని కథలు రాసే సమయంలో సౌమిత్రను మనసులో పెట్టుకొని రాశారట సత్యజిత్ రే. ‘ఫెలుదా’లోని బెంగాలీ డిటెక్టివ్ ఫెలుదా పాత్ర సౌమిత్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫెలుదా పాత్రకు సంబంధించిన నవలల్లో సౌమిత్ర ఛటర్జీ రూపురేఖల ఆధారంగా బొమ్మలు వేయించారట రే. సౌమిత్ర, నిర్మల్యా ఆచార్య స్థాపించిన మేగజీన్‌కి పేరు పెట్టమని రేని కోరితే ‘ఎక్కోన్’ అని పేరు పెట్టారు. ‘ఎక్కోన్’ అంటే ‘ఇప్పుడు’ అని అర్థం. పేరుతో పాటు కవర్ పేజీ డిజైన్ కూడా చేసి పెట్టారట. వీరి కాంబినేషన్లో ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ వంటి సినిమాలు పాపులారిటీ పొందాయి. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాను. మా నాన్నగారిది, ఆయన (సౌమిత్ర)ది అద్భుతమైన కెమిస్ట్రీ. నాన్న సృష్టించిన పాత్రను తనదైన ఆలోచనతో చేశారాయన. ‘ఆషానీ సంకేత్’లోని గంగాచరణ్ పాత్ర సౌమిత్రగారికి ఎంతో ఇష్టం. ఆయన సినిమాలో ఎంతగా లీనమయ్యేవారంటే ఒకసారి ట్రాలీ తోసే మనుషులు తక్కువైతే ఆయనే తోశారు. అంతటి గొప్ప వ్యక్తి. – దర్శకుడు సందీప్ రే, సత్యజిత్ రే తనయుడు -
'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్ సో ప్రౌడ్'
న్యూఢిల్లీ: సినీరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్న నేపథ్యంలో.. తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ తన భావోద్వేగాలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న నా తండ్రికి శుభాకాంక్షలు. View this post on Instagram A memory to cherish. #dadasahebphalkeaward #theparentals A post shared by Abhishek Bachchan (@bachchan) on Dec 29, 2019 at 10:35am PST 'నాకు మీరే స్ఫూర్తి అంటూనే మై హీరో.. కంగ్రాచ్యులేషన్స్ పా.. వీ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు' అంటూ వ్యాఖ్యానించారు. ఇక అమితాబ్ కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అవార్డు అందుకున్నప్పటి ఫోటోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 23న జరిగింది. అయితే, అనారోగ్యం కారణంగా తాను రాలేకపోతున్నట్లు అమితాబ్ ముందుగా నిర్వాహకులకు చెప్పడంతో.. ఆదివారం ప్రత్యేకంగా ఈ అవార్డును రాష్టపతి ఆయనకు అందించారు. T 3592/3/4/5 - .. my immense gratitude and respect for this moment ..🙏 pic.twitter.com/WavW3Hwkjw — Amitabh Bachchan (@SrBachchan) December 29, 2019 -
బిగ్‌బీకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రధానం
-
బిగ్‌బీకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఈ పురస్కారాన్ని అమితాబ్ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు. అప్పుడు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘జ్వరంతో బాధపడుతున్నాను. ప్రయాణాలు చేయొద్దని వైద్యులు చెప్పారు. దిల్లీలో జరగబోయే జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాను. ఇది దురదృష్టకరం. విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అమితాబ్‌కు పురస్కారాన్ని అందజేశారు. (చదవండి : బచ్చన్ సాహెబ్) భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి (2019) గాను అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది. -
బచ్చన్ సాహెబ్
బిగ్ స్క్రీన్ లాంటి వారు అమితాబ్ బచ్చన్. కళ్లారా చూస్తున్నట్లు ఉంటుంది. ‘దాదా సాహెబ్’ అయ్యారుగా.. ఇప్పుడింకా బిగ్ అయ్యారు! ఈ పొడవాటి నటుడి జీవితంలో... ప్రతి దశలోనూ అనేక వెలుగు నీడలు. ప్రతి నీడలోనూ అనేక దశలు.. దిశలు. ‘‘నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడమే ప్రతీకారం తీర్చుకోవడం’’. మంగళవారం అమితాబ్ బచ్చన్ ట్వీటర్లో కనిపించిన కొటేషన్ ఇది. పగ, ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకోవడం కాదు. మనల్ని మనం మెరుగుపరచుకోవడం. అమితాబ్ చక్కగా చెప్పారు. ఇంతకుముందు చాలామంది చాలాసార్లు ఈ మాట చెప్పి ఉండొచ్చు. కానీ బిగ్ బి చెబితే ఆ మాట పెద్దది అవుతుంది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి చేరుకున్న వ్యక్తి కాబట్టి. ‘అమితాబ్ బచ్చన్’ పేరుకి ముందూ వెనకా ‘సూపర్ స్టార్’, ‘సెహన్ షా ఆఫ్ బాలీ వుడ్’, ‘సాహెబ్’, ‘బిగ్ బి’.. ఇలా బోలెడన్ని పెద్ద బిరుదులు. కోరుకుంటే సునాయాసంగా వచ్చి పడినవి కాదు. రాత్రింబవళ్లూ కష్టపడి తెచ్చుకున్నవి. అందుకే వాటికి ఎంతో విలువ. ఇప్పుడు అమితాబ్‌కి మరో విలువైనది దక్కింది. అర్హత ఉన్న వ్యక్తికి దక్కాల్సినదే దక్కింది. భారతీయ చిత్రసీమకు గణనీయమైన సేవలందించేవారికి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం ‘బచ్చన్ సాహెబ్’కి దక్కింది. సాదా సీదా అమితాబ్ బచ్చన్ సాహెబ్ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు? అది చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుందేమో. ఆయన జీవితం నుంచి ఆదర్శంగా తీసుకోదగ్గవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం. మరో 20 రోజుల్లో అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. 1942 అక్టోబర్ 11న పుట్టారు. 77 ఏళ్లు నిండి 78లోకి అడుగుపెడతారు. ఈ 78 ఏళ్ల జీవిత కాలంలో ‘అమితాబ్ అయిపోయాడు’ అనుకున్న ప్రతిసారీ ఆ మాటలను ఆయన అబద్ధం చేశారు. అమితాబ్ అంటే ‘అమితమైన వెలుగు’ అని అర్థం అని పెద్దవాళ్లు అంటారు. నిజానికి అమితాబ్ తల్లిదండ్రులు తేజీ బచ్చన్, హరివంశ్రాయ్ బచ్చన్ కొడుకుకి ‘ఇంక్విలాబ్’ అని పేరు పెట్టాలనుకున్నారు. ‘బచ్చన్’ అనే కలం పేరుతో హరివంశ్రాయ్ కవితలు రాసేవారు. ఓ స్నేహితుడి సలహా మేరకు ‘ఇంక్విలాబ్’ పేరు పెట్టాలనే ఆలోచనను విరమించుకుని ‘అమితాబ్’ అని పెట్టారు. ‘పేరు బలం’ అనేదాన్ని నమ్మొచ్చేమో. నిజంగానే అమితాబ్ జీవితం అంతా వెలుగు. అయితే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందన్నట్లు అమితాబ్ జీవితంలోనూ ‘చీకటి’ ఉంది. సాదాసీదా చీకటి కాదు.. ఎంతో పెద్ద వెలుతురు వస్తే పోయే చీకటి అది. ఆ వెలుతురు కోసం అమితాబ్ ధైర్యంగా నిలబడ్డారు. చీకటిని తరిమేశారు. అసలు సినిమాల్లోకి రావాలని అమితాబ్ ఎందుకు అనుకున్నారు? పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమాల్లోకి రావాలనే అమితాబ్ ఆలోచనకు ప్రేరణ ఆయన తల్లి. నటనంటే ఆమెకు చాలా ఇష్టం. సినిమాల్లో నటించమని కూడా ఆమెను అడిగారు. కానీ ఇంటి బాధ్యతలు తీసుకుని, ఇంటిపట్టునే ఉండిపోయారు. ‘‘నువ్వు ఏదైనా చెయ్. కానీ నలుగురిలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ‘సెంటరాఫ్ స్టేజ్’లా ఉండాలి’’ కొడుకుతో అన్నారు తేజీ బచ్చన్. అమితాబ్ కూడా ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. ‘సినిమా’ మంచి ఆప్షన్ అనిపించింది. కానీ ముందూ వెనకా ఎవరూ లేరు. ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాలి. అలహాబాదులో పుట్టిన అమితాబ్ కెరీర్‌ని వెతుక్కుంటూ ముంబైలో అడుగుపెట్టినప్పుడు చేతిలో పెద్దగా డబ్బు లేదు. స్నేహితులు కొందరు ఉన్నారు. అంత త్వరగా సహాయం తీసుకునే మనస్తత్వం కాదు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయా ఓకే.. లేకపోతే టాక్సీ డ్రైవర్ అయిపోదాం అనుకున్నారు. కానీ ప్రతిభావంతులను వెండితెర వదలదు. 50, 100 రూపాయల కోసం రేడియోలో అనౌన్స్మెంట్లు చెబుతూ, సినిమాల్లో ట్రై చేస్తున్న అమితాబ్‌ని స్టార్‌ని చేయాలనుకుంది. 1969లో వచ్చిన జాతీయ అవార్డు సినిమా ‘భువన్ షోమ్’కి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అమితాబ్ సినిమా కెరీర్ ఆరంభమైంది. అప్పుడే ‘సాత్ హిందుస్తానీ’ అనే సినిమాలో ఏడుగురిలో ఒక నటుడిగా అమితాబ్‌కి చాన్స్ వచ్చింది. వెండితెరపై తొలిసారి అమితాబ్ కనిపించిన సినిమా ఇది. ఇంటి పేరు ‘శ్రీవాస్తవ్’ అయినప్పటికీ తండ్రి కలం పేరుని ఇంటి పేరుగా చేసుకుని ‘అమితాబ్ బచ్చన్’ పేరుతో సినిమాల్లోకి వచ్చారు. అవకాశాలైతే వస్తున్నాయి కానీ వచ్చినవి వచ్చినట్లే థియేటర్ నుంచి వెళ్లిపోతున్నాయి. పైగా అమితాబ్ టీనేజ్‌లో ఏం ఎంటర్ కాలేదు. 30 ఏళ్ల వయసుకి దగ్గరపడుతున్న సమయంలో సినిమాల్లోకి వచ్చారు. ‘అసలా హైట్ ఏంటి? ఆ గొంతు ఏంటి? నటన వచ్చా?’... కెరీర్ స్టార్టింగ్‌లోనే విమర్శలు. దాంతో పాటు వరుసగా 12 ఫ్లాపులు. అమితాబ్‌కి అంతా చీకటిగా కనిపించింది. అయినా వెనక్కి వెళ్లిపోవాలనుకోలేదు. ఆ సమయంలో వచ్చిన వెలుతురే ‘జంజీర్’. అమితాబ్‌ని స్టార్‌ని చేసిన సినిమా. ‘యాంగ్రీ యంగ్ మేన్’ అని టైటిల్ ఇచ్చిన సినిమా. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ నటుడిని చేసిన సినిమా. ఆ తర్వాత వచ్చిన ‘దీవార్’, ‘షోలో’, ‘డాన్’ వంటి చిత్రాలతో అమితాబ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. కెరీర్ సాఫీగా సాగిపోతోంది. ఒంట్లో కావాల్సినంత ఓపిక ఉంది. ఇంకేముంది? అమితాబ్ కెరీర్ స్పీడ్‌ని ఎవరూ ఆపలేరనుకుంటున్న సమయంలో ‘కూలీ’ (1983) సినిమా అమితాబ్‌ని మరణం అంచుల వరకూ తీసుకెళ్లింది. ఆ సినిమా కోసం ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు విలన్ పునీత్ నిస్సార్ పంచ్ అదుపు తప్పి అమితాబ్ కడుపుని బలంగా తాకింది. బిగ్ బి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. లోపల పేగు తెగింది. లోపల జరిగిన నష్టాన్ని గుర్తించని డాక్టర్ ఏదో చికిత్స చేశాడు. వేరే డాక్టర్ గ్రహించి, సరైన సమయంలో చికిత్స చేయడంతో అమితాబ్ బతికారు. ‘కూలీ’ చిత్రదర్శకుడు మన్మోహన్ దేశాయ్ నిజానికి సినిమాలో అమితాబ్ పాత్రను చంపేద్దామనుకున్నారు. కానీ నిజజీవితంలో బతికి బయటపడ్డ వ్యక్తిని సినిమాలో అలా చూపించడం ఆయనకు మనస్కరించలేదు. ఆ క్యారెక్టర్ని బతికించారు. సినిమా సూపర్ హిట్ అయింది. అయితే అమితాబ్ ఆరోగ్యం పాడైంది. దాంతో దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయాల్లోకి వెళ్లారు. అక్కడా విజయమే. అయితే మనసంతా సినిమా పైనే. అందుకే వచ్చేశారు. ‘షెహన్షా’ (1988) వంటి సూపర్ హిట్‌తో మళ్లీ వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత చేసిన ‘జాదూగర్’, ‘తూఫాన్’ వంటి సినిమాలు నిరాశపరిచాయి. సినిమాలు ఫ్లాప్ అయినా నటుడిగా ఫెయిల్ కాలేదు. 1990లో వచ్చిన ‘అగ్నిపథ్’ ఉత్తమ నటుడిగా అమితాబ్‌కి తొలి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘ఖుదాగవా’ (1992)తో బచ్చన్ దాదాపు రిటైర్మెంట్ స్టేజ్‌కి వచ్చేశారు. అప్పుడే నిర్మాత కావాలనుకుని ‘ఎబీసీఎల్ కార్పొరేషన్’ మొదలుపెట్టారు. ‘తేరే మేరే సప్నే’ ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి సినిమా. ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత ఇదే బేనర్ మీద అమితాబే హీరోగా నటించి, నిర్మించిన ‘మృత్యుదాత’ (1997) ఫెయిలైంది. 1992 తర్వాత ఐదేళ్లకు అమితాబ్ తెరపై కనిపించిన సినిమా ఇది. ఆర్థికంగా భారీ ఎత్తున నష్టపరచిన సినిమా. దాంతో పాటు ‘1996 మిస్ వరల్డ్ బ్యూటీ పెజెంట్, బెంగళూరు’కి ఏబీసీఎల్ స్పాన్సరర్‌గా చేయడం, అది కూడా నష్టాన్నే మిగల్చడంతో అమితాబ్ చివరికి ఎంతో కష్టపడి కట్టించుకున్న ‘ప్రతీక్ష’ (అమితాబ్ ఇంటి పేరు) ని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిజాయతీగా కష్టపడి సంపాదించిన సొమ్ము మన దగ్గరే ఉంటుందట. అలా ‘ప్రతీక్ష’ను అమ్మకుండానే అమితాబ్ మెల్లిగా మెల్లిగా తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో 2000లో కమిట్ అయిన టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అమితాబ్‌కి కోట్లు సంపాదించిపెట్టింది. అంత పెద్ద స్టార్ బుల్లితెర షో చేయడం ఇతర నటీనటులకు కూడా ఆదర్శం అయింది. సల్మాన్, ఆమిర్, షారుక్ వంటి ఖాన్ హీరోలు కూడా బుల్లితెరకు రావడానికి అమితాబ్ ఓ కారణం. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు, యాడ్స్ చేస్తూ అమితాబ్ ఫుల్ బిజీ. 77 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ స్టేజ్ దాటాక ఫుల్ బిజీగా ఉండే అవకాశం అమితాబ్లాంటి ఏ కొద్దిమందికో దక్కుతుంది. అమితాబ్ ఎన్నోసార్లు పడ్డారు. అంతే వేగంగా లేచి, నిలబడ్డారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఆయన చెంత ఉన్నాయి. గుండెల్లో పెట్టుకుని చూసుకునే భార్య జయాబచ్చన్ ఉన్నారు. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ఉన్నారు. కూతురు శ్వేతానంద, అల్లుడు నిఖిల్ నందా, మనవరాలు నవ్యా నవేలీ, మనవడు అగస్త్య ఉన్నారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అమితాబ్‌కి ఇంకేం కావాలి? ‘‘ఎప్పటికీ నటించాలని ఉంది’’ అంటారు అమితాబ్. 77 ఏళ్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, అనుకున్నవన్నీ సాధించిన అమితాబ్ ఈ ఆశ కూడా నెరవేరుతుంది. అమితాబ్ బచ్చన్ నమ్ముకున్నది ఒక్కటే. ‘నిజాయతీగా కష్టపడటం’. ఆ నిజాయితీయే ఆయన్ను ‘సాహెబ్’ను చేసింది. ‘సైరా’లో... అమితాబ్ ఈ ఏడాది తెలుగు స్క్రీన్‌పై పెద్ద పాత్రలో కనిపించనున్నారు. అదే ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. -
బిగ్‌బీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి (2019) గాను అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది. ఈ సందర్భంగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వన్ మాన్ ఇండస్ట్రీ.. బిగ్‌బీ 1942 అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జన్మించిన అమితాబ్ హరివంశ్ బచ్చన్ భారతీయ సినిమాలో అత్యంత ప్రభావవంతమైన నటుడిగా ప్రఖ్యాతి గాంచారు. 1970లలో విడుదలయిన జంజీర్, దీవార్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. తన పాత్రలతో భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనతికాలంలోనే బాలీవుడ్లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను పొందారు. నాలుగు దశాబ్దాల్లో దాదాపు 190 సినిమాలలో ఆయన నటించి, మెప్పించారు. 1970, 80, 90లలో తెరపై అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని "వన్ మాన్ ఇండస్ట్రీ"గా అభివర్ణించారు. దీంతో ఆయన అప్పట్లోనే ఆయన స్థానం ఏంటో అర్థమవుతుంది. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరాలోనూ బిగ్‌బీ నటిస్తున్నారు. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరికిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్‌కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడుగా రికార్డు సృష్టించారు. నటునిగానే కాక, నేపధ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు. 1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హానర్"తో గౌరవించింది. హాలీవుడ్ లో మొదటిసారి 2013లో "ది గ్రేట్ గేట్స్బే" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. 1980లో రాజకీయాలలో కొంత కాలంపాటు క్రీయాశీలకంగా పనిచేశారు. తాజాగా ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవకుగాను ప్రతిష్టాత్మక దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అభినందనల వెల్లువ... ప్రతిష్టాత్మక దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికనైన సందర్భంగా అమితాబ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ రూపురేఖలను మార్చిన గొప్ప నటుడికి ఈ అవార్డు అభించిందని సీఎం అభిప్రాయపడ్డారు. కాగా దేశ వ్యాప్తంగా బిగ్‌బీకి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 వేడుక
-
రజనీకాంత్ పోలియో డ్రాప్స్ అని ప్రచారం చేసేవాళ్లు
‘‘దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులను దక్షిణాదిలో కూడా ఇవ్వడం సౌత్‌కి దక్కిన ఓ గొప్ప గుర్తింపు, గౌరవం’’ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకొని ‘దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019’ వేడుకను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోని పలువురు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ– ‘‘భారతీయ చిత్ర పరిశ్రమకి సౌత్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఒకప్పుడు మేం తమిళనాడులోని సాలెగ్రామంలో ఉండేవాళ్లం. అక్కడ చాలామంది ఫిల్మ్‌స్టార్స్ ఇళ్లు ఉండేవి. వాళ్లలో విజయ్‌కాంత్, విజయ్ వంటి వారున్నారు. వారి మధ్య నేను ఒక్కదాన్నే నాన్ ఫిల్మ్‌స్టార్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంతమంది ఫిల్మ్‌స్టార్స్ ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ వేడుకలో పాల్గొన డం గర్వంగా ఉంది. ఫిల్మ్‌స్టార్స్ పని ఈజీ కాదు. మంచి సినిమాలు తీయడం కోసం నిద్ర లేకుండా కష్టపడతారు. 30 ఏళ్ల కిందట తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పోలియో ఉండేది. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అప్పటి ప్రభుత్వం రజనీకాంత్, మనోరమ పోలియో డ్రాప్స్ అని ప్రచారం చేసేది. దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి రజనీకాంత్ పోలియో డ్రాప్స్ వేయండి, మనోరమ పోలియో చుక్కల మందు వేయండి అనడం గర్వకారణం’’ అన్నారు. అవార్డుగ్రహీతల స్పందన ఈ విధంగా... ► ‘భరత్ అనే నేను’ సినిమాకి ఉత్తమ నటుడిగా ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు మా వారికి (మహేశ్‌బాబు) రావడం గర్వంగా ఉంది. అనుకోని కారణాల వల్ల ఆయన ఈ వేడుకకు రాలేకపోయారు. – నమ్రత, నటి–మహేశ్‌బాబు సతీమణి ► ‘రంగస్థలం’కి ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. ఈ అవార్డును మా ఆవిడకి అంకితం ఇస్తున్నా. ఈరోజు తన పుట్టినరోజు. – సుకుమార్, డైరెక్టర్ ► నేను సినిమా రంగంలో లేకున్నా ఫాల్కే మనవడిని అయినందుకు చాలా గర్విస్తున్నా. భారతీయ సినిమాను ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. హాలీవుడ్ సైతం ఇండియన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటోంది. నాకు బాలీవుడ్ కన్నా దక్షిణాది చిత్రసీమ అంటేనే చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా. – చంద్రశేఖర్ పుసాల్కర్ ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకి ఉత్తమ నూతన నటి అవార్డు రావడం హ్యాపీ. ఆస్కార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల గురించి నా చిన్నప్పుడు మా అమ్మ గొప్పగా చెప్పేవారు. – పాయల్ రాజ్‌పుత్, హీరోయిన్ ► చిన్నప్పుడు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ గురించి విన్నప్పుడు ‘వావ్’ అనిపించేది. అలాంటిది ఇప్పుడు సౌత్‌లో ఈ అవార్డులను స్టార్ట్ చేయడం, నేను అవార్డు అందుకోవడం నమ్మలేకపోతున్నా. ఈ అవార్డు మా నాన్న సత్యమూర్తిగారికి అంకితం. – దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సంగీత దర్శకుడు (రంగస్థలం). ► ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘రంగస్థలం’ సినిమాకి దాదాసాహెబ్గారి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మ, నా భార్య, కూతురికి అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వరుస షూటింగ్‌లతో వాళ్లను రెండేళ్లుగా మిస్ అవుతున్నా. – రత్నవేలు, కెమెరామేన్ ► ఈ ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. – యష్, హీరో ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ సీఈవో అభిషేక్ మిశ్రా, ప్రతినిధులు వినయ్‌తో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. సురభి, పాయల్ రాజ్‌పుత్, అవికా గోర్, ఆషిమా -
తమన్నాకు దాదాసాహెబ్ అవార్డు
సాక్షి, ముంబై : మిల్కీ బ్యూటీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. ఇటీవలే జీ సంస్థలు నిర్వహించిన అప్సర అవార్డుల్లో శ్రీదేవి అవార్డు అందుకున్న తమన్నా తాజాగా మరో అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు ఆమెను వరించింది. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన బాహుబలి సిరీస్‌లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగంలో తమన్నా అద్భుత నటనకు గాను ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోన్నారు. తమన్నాతో పాటు రణ్వీర్ సింగ్, అనుష్క శర్మలకు కూడా ఈనెల 21న అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ముంబైకి చెందిన దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తెలిపింది. తనకు ఈ అవార్డు ప్రకటించడం పట్ల హీరోయిన్ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే ఎంతో సేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో నా నువ్వే.. క్వీన్ రీమేక్‌లో నటిస్తున్నారు. -
విశ్వనాథుడు.. ‘కళా’ సార్వభౌముడు
-
విశ్వనాథే నాకన్నీ నేర్పించారు: కృష్ణ
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌కు ప్రముఖ నటుడు కృష్ణ అభినందనలు తెలిపారు. ఆయన శనివారం విశ్వనాథ్ నివాసానికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ థ్రిల్లర్, యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విశ్వనాథ్‌తో తాను ఎక్కువ సినిమాలు చేయలేకపోయినట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు నటన వచ్చేది కాదని, ఆరు నెలలు పాటు శ్రమించి విశ్వనాథ్ తనకు అన్నీ నేర్పించారని అన్నారు. (దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ‘ తేనె మనసులు’ చిత్రానికి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చేయ్యడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనెమనసులు' కృష్ణని హీరో చేసి నిలబెట్టింది) మరోవైపు కృష్ణ స్వయంగా తన ఇంటికి రావడంపై విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘కృష్ణ మా ఇంటికి రావడం కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
కళాతపస్వికి ‘ఫాల్కే’ అవార్డు
⇔ రాష్ట్రపతి చేతుల మీదుగా 3న పురస్కారం ప్రదానం ⇔ విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మైమరపించిన కె.విశ్వనాథ్ ⇔ కథ, కథనం, సాంస్కృతిక అంశాలకు పెద్దపీట ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌కు 2016వ సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందిస్తోంది. ఫాల్కే అవార్డు కమిటీ సిఫారసులను కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఆమోదించారు. మే 3న ఇక్కడి విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. దాదాసాహెబ్ ఫాల్కే 48వ పురస్కారాన్ని విశ్వనాథ్‌కు అంద జేస్తారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు, శాలువాతో సత్కరిస్తారు. శాస్త్రీయ, సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యాన్ని తన సినిమాలతో అందిస్తూ భారత సినీ పరిశ్రమకు విశ్వనాథ్ మార్గదర్శిగా నిలిచారు. బలమైన కథ, మనోహరమైన కథనం, ప్రామాణికమైన సాంస్కృతిక అంశాలకు పేరొందిన దర్శకుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1965 నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు రూపొందించారు. సామాజిక, మానవీయ అంశాలపై విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. 1930లో గుడివాడలో జన్మించిన ఆయన కళా ప్రేమికుడు. కళలు, సంగీతం, నృత్యం తదితర విభిన్న నేపథ్యాలతో సినిమాలు రూపొందించారు. 1992లోనే ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఐదు జాతీయ అవార్డులు, 20 నంది అవార్డులు, 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా దక్కింది. ‘స్వాతి ముత్యం’చిత్రం 59వ అకాడమి ఆవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో భారత అధికార ఎంట్రీ చిత్రంగా నిలిచింది. సిరివెన్నెల, స్వాతిముత్యం, శంకరాభరణం తదితర చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుల పరంపరలో భాగంగా 2016లో విశ్వనాథ్‌ను లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. తనదైన శైలిలో ప్రేక్షకులను మైమరపించిన ఈ కళాతపస్వికి అరుదైన గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు శుభాకాంక్షలు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ నాథ్‌కు ఈ అవార్డు వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగిం దని సంతోషం వ్యక్తం చేశారు. శంకరాభ రణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసం గమం, స్వర్ణకమలం, తదితర ఎన్నో చిత్రా లను ఆయన అందించారని తెలిపారు. ఆ రోజుల్లోనే తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత విశ్వనాథ్‌దేనని, ఆయన భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. విశ్వనాథ్‌కు వైఎస్ జగన్ అభినందనలు.. ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పురస్కారం అందుకున్న విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ అవార్డు రావడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణమని కీర్తించారు. ఇది తెలుగు సినిమా రంగానికి దక్కిన గౌరవమని, తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో మరచిపోలేని సినిమాలను విశ్వనాథ్ అందించారని జగన్ ఈ సందర్భంగా ప్రస్తుతించారు. -
తెలుగు దర్శకుడికి అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: భారతీయ సినీ రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" మరోసారి తెలుగువారిని వరించింది. ప్రముఖ దర్శకుడు 'కళాతపస్వి' కె. విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికిగానూ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో మే 3న జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ.. విశ్వనాథ్‌కు అవార్డును అందజేస్తారు. ఫాల్కే అవార్డు దక్కడంపై కళాతపస్వి విశ్వనాథ్ స్పందిస్తూ.. 'నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు'అని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి.. కె.విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కళాతపస్వికి అభినందనలు తెలుపుతున్నారు. గతంలో విశ్వనాథ్ రూపొందించిన 'శంఖరాభరణం' సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఏమిటీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు? భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం. దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు. 1969లో తొలి అవార్డును దేవికా రాణికి ప్రదానం చేశారు. ఇప్పటివరకు పురస్కారాన్ని 45 మందికి అందజేశారు.భారత చలన చిత్ర పితామహుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన్నే దాదా సాహెబ్ ఫాల్కే అంటారు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ఆయన 1913లో నిర్మించారు. ఆరుగురు తెలుగు వారికి: దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఇప్పటి వరకు ఆరు గురు(విశ్వనాథ్‌తో కలిపి) తెలుగువారికి దక్కింది. 1. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974) 2. ఎల్.వి.ప్రసాద్ (1982) 3. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986) 4. అక్కినేని నాగేశ్వరరావు (1990) 5. డి.రామానాయుడు (2009) 6. కె. విశ్వనాథ్ (2016) -
కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
-
పైడి జైరాజ్ చరిత్ర తెలియచేయాలి
తెలంగాణ తొలి కథానాయకుడు, దర్శక-నిర్మాత పైడి జైరాజ్ నిజాం కాలంలోనే ముంబై వెళ్లి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి పేరు తెలుగు సినిమా చరిత్రలో వినిపించడం లేదు. ఆయన చరిత్ర ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. పైడి జైరాజ్ 107వ జయంతిని ఫిలించాంబర్‌లో నిర్వహించారు. ‘‘జైరాజ్ వంటి గొప్ప వ్యక్తి చరిత్రను తెలుగు చిత్ర పరిశ్రమ వారు పట్టించుకోవడం లేదు. ఫిలింనగర్లో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అని దర్శకుడు బాబ్జీ అన్నారు -
మనోజ్‌కుమార్‌కు ‘ఫాల్కే’
* దేశభక్తి సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన హీరో *పురస్కారంతో పాటు 10 లక్షల నగదు న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్(78)కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించారు. ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘ఉపకార్’, ‘క్రాంతి’ లాంటి విజయవంతమైన దేశభక్తిని ప్రబోధించే సినిమాల్లో కథానాయకుడిగా మనోజ్ నటించారు. ‘మేరా దేశ్ కి ధర్తీ..’ ‘ఏక్ ప్యార్ క నగ్మా హై తదితర ఎవర్గ్రీన్ పాటల్లోనూ ఆయన కనిపిస్తారు. ఫాల్కే అవార్డ్ కింద స్వర్ణ కమలం, 10 లక్షల నగదును ఆయనకు అందించనున్నారు. లతామంగేష్కర్, ఆశాభోంస్లే, కవి, రచయిత సలీమ్ ఖాన్, గాయకులు నితిన్ ముకేశ్, అనూప్ జలోటాలతో ప్రభుత్వం నియమించిన ఎంపిక కమిటీ మనోజ్ కుమార్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. మనోజ్ కుమార్ హీరోగా నటించిన వాటిలో హరియాలీ ఔర్ రాస్తా, హనీమూన్, వో కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, సాజన్, దో బదన్, పథ్థర్ కే సనమ్, రోటీ కపడా ఔర్ మకాన్.. తదితర విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న అబోతాబాద్లో 1937, జూలై 24న మనోజ్ జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు హరికృష్ణగిరి గోస్వామి. మనోజ్‌కు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఢిల్లీకి తరలి వచ్చింది. డిగ్రీ అనంతరం మనోజ్ సినీరంగ ప్రవేశం చేశారు. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం ప్రేరణతో మనోజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఉపకార్’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. సంతోషంగా ఉంది: మనోజ్‌కుమార్ పురస్కారాన్ని తనకు ప్రకటించడం పట్ల మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. స్నేహితులు ఫోన్ చేసి చెబితే తొలుత నమ్మలేదని వ్యాఖ్యానించారు. -
నడవలేని స్థితిలో ఉన్నా! రాలేను..!!
2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం ప్రసిద్ధ హిందీ నటుడు శశికపూర్‌ను వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారానికి శశికపూర్ పూర్తి అర్హుడు అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే పురస్కారాన్ని స్వయంగా వెళ్లి, స్వీకరించే పరిస్థితిలో శశికపూర్ లేరు. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌కి పరిమితమైన తాను వచ్చే నెలలో జరగబోయే అవార్డు వేడుకకు హాజరు కాలేననీ, అందుకు తనను క్షమించమనీ శశికపూర్ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చరిత్రలో ఇలా జరగడం రెండో సారి. 2012 సంవత్సరానికి బాలీవుడు విలన్ ప్రాణ్‌కు ఈ అవార్డు వరించింది. ఆయన కూడా నడవలేని స్థితిలో ఉండటంతో ఈ అవార్దును ఆయన స్వగృహంలో అందజేశారు. -
శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
అంతర్జాతీయం ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు దేశాల్లోనే.. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు మధ్య ఆదాయ దేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, ఇండోనేషియాలో ఉన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) మార్చి 19న తన నివేదికలో పేర్కొంది. 2014లో బలమైన ఆర్థిక వృద్ధి చూపిన ఈ దేశాల్లో 363 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్న వారున్నట్లు తెలిపింది. 2014-15 ప్రపంచ ఆహార విధాన నివేదిక (జీఎఫ్‌పీఆర్) ఈ దేశాలు తమ ఆహార విధానాలను మార్చుకోవాలని కోరింది. పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టిసారించాలని, వ్యవసాయంలో లింగ వ్యత్యాసం తొలగించాలని, అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు గ్రామీణ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరింది. ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ బెంజిమెన్ నెతన్యాహూ మరోసారి ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగనున్నారు. మార్చి 18న జరిగిన ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ పార్లమెంటు నెస్సెట్‌లోని 120 స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుంది. అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఇతర చిన్నపార్టీలతో కలిసి నెతన్యాహూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టారు. జాతీయం కనిష్టంగా ‘టోకు ధరల సూచీ’ ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015 ఫిబ్రవరిలో -2.06 శాతంగా నమోదైంది. ఇంత కనిష్ట స్థాయిలో నమోదు కావడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. వరుసగా నాలుగో నెల ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ఈ రేటు తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 16న విడుదల చేసిన గణాంకాల్లో ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడించింది. నల్లధనం నియంత్రణ బిల్లుకు ఆమోదం విదేశాల్లో దాచిన నల్లధనం కేసులకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ మార్చి 17న ఆమోదం తెలిపింది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల (పన్ను విధింపు) బిల్లు-2015కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం దాచిపెట్టిన ఆదాయం, ఆస్తులకు సంబంధించిన పన్నులపై 300 శాతం జరిమానా విధిస్తారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది. విదేశీ ఆస్తులకు సంబంధించిన వివరాలు సరిగా చూపకపోయినా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోయినా విచారణ పరిధిలోకి వస్తారు. ఈ కేసుల్లో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. పన్ను విధించదగ్గ ఆదాయం లేకపోయినప్పటికీ విదేశీ ఆస్తుల సొంతదారు, లబ్ధిదారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. వీటిలో విదేశీ ఖాతా తెరిచిన తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి. నేరానికి పాల్పడిన వారు వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించడానికి అనుమతి ఉండదు. జాట్ల కోటాను రద్దుచేసిన సుప్రీంకోర్టు జాట్ వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కేంద్ర జాబితాలో చేర్చుతూ గతంలో జారీఅయిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 17న రద్దు చేసింది. 2014, మార్చిలో యూపీఏ ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది. అయితే జాట్లను ఓబీసీల్లో చేర్చాల్సిన అవసరం లేదంటూ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ చేసిన సిఫార్సును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. జాట్లు బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉన్నారు. అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం దేశీయంగా రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్).. ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని మార్చి 18న ఒడిశాలోని చాందీపూర్‌లో చేపట్టారు. క్షిపణిని సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి కదులుతున్న లక్ష్యం వైపు ప్రయోగించారు. యుద్ధ విమానం నుంచి క్షిపణి విడిపోయి, 2 కి.మీ. ఎత్తులో కదులుతున్న లక్ష్యాన్ని అడ్డుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన అతిచిన్న క్షిపణి అస్త్ర. దీని పొడవు 3.8 మీటర్లు. ఇది 15 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. సూపర్సోనిక్ వేగంతో శత్రు విమానాలను అడ్డుకొని, ధ్వంసం చేయగలదు. ప్రతినెలా 7 నుంచి టీకాల వారం వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ ఏడాది తొలివిడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమ చిత్రం ‘కోర్టు’ డెరైక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలనచిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వీటిని విజేతలకు మే 3, 2015న అందజేస్తారు. ఉత్తమ ఫీచర్ చలనచిత్రం: కోర్టు (మరాఠీ); ఉత్తమ పాపులర్ చలనచిత్రం: మేరీ కోమ్ (హిందీ); ఉత్తమ బాలల చలనచిత్రం: కాక్కా ముత్తైతమిళం); ఎలిజబెత్ ఏకాదశి (మరాఠీ); ఉత్తమ నటుడు: విజయ్ (నాను అవనల్లా అవళు, కన్నడ); ఉత్తమ నటి: కంగనా రనౌత్ (క్వీన్, హిందీ); ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (చోటుష్కోనే, బెంగాలీ); ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రం (తెలుగు): చందమామ కథలు క్రీడలు కెప్టెన్‌గా ధోనీ రికార్డు భారత క్రికెట్ జట్టును వంద వన్డేల్లో గెలిపించిన కెప్టెన్‌గా ఎం.ఎస్.ధోనీ రికార్డు సృష్టించాడు. మార్చి 19న బంగ్లాదేశ్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో విజయంతో ఈ గుర్తింపు లభించింది. ధోనీ 178 వన్డేల్లో 100 విజయాలు సాధించాడు. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియేతర ఆటగాడు ధోనీనే. రికీ పాంటింగ్ (165), అలెన్ బోర్డర్ (107) ధోనీ కంటే ముందున్నారు. సానియా జోడీకి ఇండియన్ వెల్స్ టైటిల్ సానియా మీర్జా స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 21న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జోడీని సానియా-హింగిస్ జోడీ ఓడించింది. విజేతగా నిలిచిన వీరికి రూ.కోటి 83 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సానియాకు కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్ కాగా, హింగిస్‌కు 42వ డబుల్స్ టైటిల్. ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విస్)ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు 50వ ఏటీపీ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సిమోనా హలెప్ గెలుచుకుంది. ఈమె ఫైనల్లో జెలెనా జంకోవిచ్‌ను ఓడించింది. ప్రపంచకప్‌లో మార్టిన్ గప్తిల్ అత్యధిక స్కోర్ న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ ప్రపంచకప్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు. మార్చి 21న వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో గప్తిల్ 237 (163 బంతుల్లో) పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్. వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్. వన్డేల్లో భారత్‌కు చెందిన రోహిత్‌శర్మ నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. వార్తల్లో వ్యక్తులు మాధవ్ గాడ్గిల్‌కు టైలర్ పురస్కారం ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ 2015 సంవత్సరానికి పర్యావరణ విజయానికిచ్చే టైలర్ అవార్డుకు ఎంపికయ్యారు. గాడ్గిల్ పశ్చిమ కనుమల ఎకాలజీ ఎక్స్పర్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని సథరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ సహాయంతో టైలర్ ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 1973లో ఈ అవార్డును ఏర్పాటు చేసింది. గాడ్గిల్‌తో పాటు ఈ అవార్డుకు అమెరికన్ మెరైన్ ఎకాలజిస్టు జేన్ లుబ్చెంకో కూడా ఎంపికయ్యారు. వీరిద్దరికి రెండు లక్షల డాలర్ల నగదు బహుమతిని సమానంగా అందజేస్తారు. బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షునిగా వెంకట్రామన్ రామకృష్ణన్ బ్రిటన్‌లోని ప్రముఖ సంస్థ రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ ఎన్నికయ్యారు. దీనికోసం జరిగిన ఎన్నికల ఫలితాలను మార్చి మూడో వారంలో ప్రకటించారు. రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వెంకట్రామన్ గుర్తింపు సాధించారు. 1660లో స్థాపించిన రాయల్ సొసైటీ అధ్యక్షుడు బ్రిటన్ ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తారు. రామకృష్ణన్ 2009లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ మృతి సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ (91) సింగపూర్‌లో మార్చి 23న మరణించారు. మలేసియా నుంచి సింగపూర్ విడిపోవడంలో ప్రధానపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు లీ క్వాన్ ఎంతో కృషిచేశారు. లీ 31 ఏళ్ల పాటు 1959 నుంచి 1990లో పదవి నుంచి వైదొలగే వరకు ప్రధానిగా పనిచేశారు. లీ కుమారుడు లూంగ్ సింగపూర్ ప్రధానిగా ఉన్నారు. శ్రీలంక మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు ఫీల్డ్ మార్షల్ హోదా శ్రీలంక అత్యున్నత సైనిక హోదా ఫీల్డ్ మార్షల్‌ను ఆ దేశ మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు మార్చి 22న కొలంబోలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ప్రదానం చేశారు. ఆయన ఈ హోదాను పొందిన తొలి శ్రీలంక జాతీయుడు. ఉగ్రవాదంపై సాధించిన విజయానికి ఆయనకు ఈ హోదా దక్కింది. 2009లో తమిళ టైగర్స్‌పై విజయం సాధించే దిశగా ఆయన సైన్యాన్ని నడిపారు. ఆయన్ను 2010లో అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కింద జైలుకు పంపింది. ఆయన రెండేళ్లు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ ఒత్తిడితో 2012లో విడుదలయ్యారు. జైలుశిక్ష వల్ల ఏడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కోల్పోయారు. శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న రాజ్‌కపూర్ అనంతరం ఈ పురస్కారాన్ని అందుకోనున్న మూడో వ్యక్తి శశికపూర్. పురస్కారం కింద ఆయన స్వర్ణకమలం, రూ. 10 లక్షల నగదు అందుకోనున్నారు. 2014 ఏడాదికి ఫాల్కే అవార్డ్ గ్రహీతగా కపూర్‌ను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నమక్‌హలాల్, దీవార్, కభీకభీ తదితర హిట్ సినిమాల్లో కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్, ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ ప్రస్తుతం కిడ్నీ, ఇతర వయో సంబంధ వ్యాధులతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ అమెరికా విద్యా మండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల చైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి 16న వాషింగ్టన్లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణూ 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజేంద్రసింగ్కు స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ప్రతిష్టాత్మక స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015కు ఎంపికయ్యారు. వాటర్ మ్యాన్‌గా పిలిచే రాజేంద్రసింగ్ గ్రామీణుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు విశేష కృషిచేశారు. రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన 1959లో జన్మించారు. అనేక దశాబ్దాలుగా కరవుపై పోరాటం చేస్తున్నారు. గ్రామీణ సమాజాల్లో సాధికారతకు కృషిచేస్తున్నారు. సామాజిక పరంగా నీటి పరిరక్షణ, నిర్వహణకు కృషిచేసినందుకు ఆయనకు 2001లో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. స్టాక్‌హోం వాటర్ ప్రైజ్‌ను 1991లో స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పింది. ఈ అవార్డు కింద 1,50,000 డాలర్లు అందజేస్తారు. -
ఖిల్ తే హై గుల్ యహా...
శోభన్‌బాబు పర్సనల్ బ్రీఫ్‌కేస్‌లో ఎప్పుడూ రెండు ఫొటోలు ఉండేవి. రెండూ శశికపూర్వే. ఒకటి పాతది. ఒకటి కొత్తది. ఒకటి సన్నగా అందంగా ఉన్న ఫొటో. రెండోది లావుగా ఊబగా అయిపోయిన ఫొటో. ‘శశికపూర్లా నేను మారకూడదు. తిండి దగ్గర ఆరోగ్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ ఫొటోలు’ అని శోభన్‌బాబు చెప్పేవారు. శశికపూర్ అలా కావాలని అయ్యాడా?నిర్లక్ష్యంగా ఉన్నాడా? జెన్నిఫర్- బ్రిటిష్ నటి- నవ్వితే థేమ్స్ నది పలకరింపులా ఉండేది. శశికపూర్‌తో ప్రేమలో పడింది. దేశం కాని దేశం. భాష కాని భాష. సంప్రదాయం కాని సంప్రదాయం. పైగా కపూర్ల ఇంటి కోడలి హోదా. ధైర్యంగా అడుగుపెట్టింది. శశికపూర్ అంటే ఆమెకు ఎంత ప్రేమ అంటే ఊబకాయం శాపంగా ఉన్న ఆ కుటుంబంలో శశి దాని బారిన పడకుండా అతణ్ణి వెజిటేరియన్‌గా మార్చింది. ఆ రోజుల్లోనే ఆర్గానిక్ ఫుడ్‌ను పరిచయం చేసింది. రోజూ ఈతకు వెళ్లాల్సిందే. వ్యాయామం చేయాల్సిందే. అందమైన మొగుణ్ణి అందంగా ఉంచుకోవాలి కదా. శశికపూర్ అందంగానే ఉన్నాడు- ఆమె జీవించి ఉన్నంత వరకూ. ఆ తర్వాత? కేన్సర్ జెన్నిఫర్‌ని చాలా చిన్న వయసులో తీసుకెళ్లి ్లపోయాక- ఆమె గుర్తుగా అతడికి నలుగురు పిల్లల్ని ఇచ్చి వెళ్లి పోయాక- శశికపూర్ మనిషిలా మిగల్లేదు. ఈ పేరూ ప్రతిష్ట డబ్బూ ఐశ్వర్యం ఎందుకు? ఆమే లేనప్పుడు తాను మాత్రం ఎందుకు? ధ్వంసం చేసేశాడు... మనసునూ శరీరాన్నీ. కసి. శోభన్‌బాబుకు ఈ కథ తెలిసి ఉండొచ్చు... తెలిసి ఉండకపోవచ్చు. కాని ప్రతి పర్యవసానం వెనుకా ఒక తెలియని ఉదంతం ఉంటుంది. ఇలాంటి ఉదంతం. శశికపూర్‌కు బాల్యం నుంచి ఒక్కటే తెలుసు. యాక్టింగ్. తండ్రి పృధ్వీరాజ్ కపూర్ పెద్ద నటుడు. అన్న రాజ్‌కపూర్ స్టార్. మరో అన్న షమ్మీ కపూర్ది అదే దారి. తనకేం తక్కువ? ‘ఆగ్’, ‘ఆవారా’ సినిమాల్లో రాజ్‌కపూర్‌కు చిన్నప్పటి వేషం వేసేశాడు. అందరూ బాగా చేస్తున్నావ్ అన్నారు. ఇంకేంటి? పెద్దయ్యాక స్టార్ కావడమే. పెద్దయ్యాడు. స్టార్ కాలేదు. రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. తనలాగే వేషాల కోసం తిరుగుతున్న మనోజ్ కుమార్‌కు రూమ్మేట్ అయ్యాడు. అతణ్ణి దొందు అన్నారు. ఇతణ్ణీ దొందే అన్నారు. దొందూ దొందే. మా నాన్న... మా తాత అక్కడ చెల్లవు. నువ్వు గొప్పవాడివా కాదా అది తేల్చు ముందు అన్నారు. ఏవో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. కాస్తో కూస్తో ఆడుతూ ఉన్నాయి. కొన్ని డింకీలు. నెమ్మదిగా పేరు వచ్చింది. ఫ్లాప్ హీరో! హీరోయిన్లు శశికపూర్ పేరు చెప్తేనే పారిపోతున్నారు. అతడు తప్ప ఎవరైనా సరే. ఏం చేయాలి? అప్పుడొక ఆపద్బాంధవురాలు అతడికి తారసపడింది. నీకేంవోయ్ చాలా మంచి యాక్టర్‌వి అని ధైర్యం చెప్పింది. నీ పక్కన నేను యాక్ట్ చేస్తాను ఉండు అని ముందుకు వచ్చింది. హీరోయిన్ నంద! ఇద్దరూ కలిశారు. పూలు విరబూసే కాలం వచ్చింది. విరబూశాయి. జబ్ జబ్ ఫూల్ ఖిలే! పెద్ద హిట్. మ్యూజికల్ హిట్. ఒక రొమాంటిక్ హీరో జన్మెత్తాడు. అవును. పులి కడుపున పులే పుడుతుంది. కాకుంటే పంజా దెబ్బ కొంత ఆలస్యంగా తగిలింది. శశి కపూర్ విజృంభించాడు. ‘నీంద్ హమారి ఖ్వాబ్ తుమ్హారే’, ‘రూఠా న కరో’. ‘మొహబ్బత్ ఇస్కో కెహెతే హై’... అన్నీ నందాతోనే. అన్నీ హిట్. ఇవి వస్తుండగానే అటు బి.ఆర్.చోప్రా ‘వక్త్’, ఇటు మన ‘ప్రేమించి చూడు’ రీమేక్ ‘ప్యార్ కియా జా’.... సినిమాల వెంట సినిమాలు. సరిగ్గా అప్పుడే బెంగాల్ నుంచి ఒక పిల్లతెమ్మెర బయలుదేరి బొంబాయి తీరాన్ని తాకింది. పేరడిగితే ‘రాఖీ’ అన్నారు. శశి కపూర్‌తో ఒక సినిమా అని కూడా అన్నారు. బంగారం ఉంది. తావి వచ్చింది. బంగారానికి తావి అబ్బడం అంటే ఏమిటో ప్రేక్షకులకు తెలిసింది. ఖిల్ తే హై గుల్ యహా ఖిల్ కె బిఖర్ నే కో... ‘షర్మిలీ’- సూపర్ డూపర్ హిట్. అందులోని పాటలు... ఇప్పటికీ హిట్. సరే... ఇవన్నీ ఎవరైనా చేయగలరు. దేశం ఉలిక్కిపడేలా చేయగలగాలి. అలాంటి పాత్ర ఒకటి తగలాలి. తగిలింది. దీవార్! అమితాబ్ కంటే శశికపూర్ వయసులో పెద్దవాడు. కాని ‘దీవార్’లో అతడి తమ్ముడి వేషం వేశాడు. సినీ పరిశ్రమ దస్తూర్ అలాగే ఉంటుంది. ‘రోటీ కపడా మకాన్’లో తాను లీడ్ రోల్ చేస్తున్నప్పుడు అమితాబ్ చేతులు కట్టుకుని చాలా చిన్నపాత్ర వేస్తున్నాడు. ఇవాళ అతడు స్టార్డమ్కు వస్తే తాను చిన్న పాత్ర వేస్తున్నాడు. కాని అతడికి తెలుసు. పాత్ర చిన్నదైనా గొప్ప నటుడికి ఒక్క సన్నివేశం చాలు. ఒక్క డైలాగైనా ఏం? ఆ సినిమాలో ఆ నిర్మానుష్యమైన రాత్రి.... ఆ పాతకాలపు వంతెన... స్మగ్లర్‌గా మారిన అన్న... నీతి కోసం నిలబడిన ఇన్స్పెక్టర్ తమ్ముడు.... అన్న తనని తాము సమర్థించుకుంటున్నాడు... తమ్ముడి మీద ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. ‘మేరే పాస్ బిల్డింగే హై.. ప్రాపర్టీహై.. బ్యాంక్ బేలన్స్ హై... బంగ్లా హై... గాడీ హై... తుమ్హారే పాస్ క్యా ైెహ ?’... తమ్ముడు జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి? పొగరుగా కాదు. అహంకారంగా కాదు. తల ఎగరేస్తూ కాదు. ఆదర్శం ఎంత వినమ్రంగా ఉంటుందో అంత వినమ్రంగా. జవాబు చెప్పాడు. ‘మేరే పాస్ మా హై’.... చిన్న డైలాగ్. దేశమంతా లేచి చప్పట్లు కొట్టింది. ఇవాళ్టికీ కొడుతూనే ఉంది. మేరే పాస్ మా హై... అమితాబ్, ధర్మేంద్ర, రాజేష్‌ఖన్నా, జితేంద్ర, శతృఘ్నసిన్హా... ఈ దుమారంలో వీళ్ల కంటే ఎక్కువగా బిజీని అనుభవించినవాడు శశి కపూర్. ఎక్కువ సంపాదించినవాడు కూడా. ప్రతి సినిమాలో శశికపూర్ కావాలి. ఏ పాత్ర అయినా అతడే వేయాలి. ఎందుకంటే ఏ పాత్ర వేసినా తాను సినిమాకు బలంగా నిలుస్తాడు. అంతే తప్ప సినిమాను తనకు బలంగా చేసుకోడు. అది గమనించిన అమితాబ్ శశికపూర్‌ను దశాబ్దాల పాటు వదల్లేదు. ‘సుహాగ్’, ‘దో ఔర్ దో పాంచ్’, ‘కాలా పత్థర్’, ‘కభీ కభీ’, ‘త్రిషూల్’, ‘షాన్’... ఒక దశలో పత్రికలు శశికపూర్‌ని ‘అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్’గా కితాబిచ్చాయి. తేడాగా ఉన్నా ప్రశంస ప్రశంసే. బిజీ కొనసాగింది. అది కూడా ఎంతగా అంటే రాజ్ కపూర్ అడిగితే ‘సత్యం శివం సుందరం’కు శశికపూర్ దగ్గర డేట్స్ లేవు! దాంతో ఒళ్లు మండిన రాజ్‌కపూర్ అతడికి ‘టాక్సీ కపూర్’ అని బిరుదు ఇచ్చాడు. రోజుకి రెండు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ ఎప్పుడూ ఒక స్టుడియో నుంచి ఇంకో స్టుడియోకి ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సినిమాలు సైన్ చేస్తున్నాడని రాజ్‌కపూర్ కంప్లయింట్. కాని తానేం చేయగలడు? అన్నను మించిన తమ్ముడు. కాని నిజానికి ఇదంతా నటన. కాదు కాదు ఇదసలు నటనే కాదు. శశి కపూర్‌కు ఆ సంగతి బాగా తెలుసు. ‘థర్డ్‌రేట్ స్టంట్మేన్కు ఇవ్వాల్సిన వేషాలన్నీ నాకిస్తున్నారు’ అని చిరాకు పడ్డాడు చాలాసార్లు. తనలోని నటుణ్ణి అతడు ఈ చెత్త సినిమాలతో మరణశయ్య ఎక్కించలేదు. సజీవంగా ఉంచడానికి తండ్రి వారసత్వంగా వదిలివెళ్లిన ‘పృథ్వీ థియేటర్స్’ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంగ్లిష్ నాటకాలు వేశాడు. ఇస్మాయిల్ మర్చంట్‌తో కలిసి అనేక ఇండో అమెరికన్ సినిమాల్లో నటించాడు. సత్యజిత్ రే దర్శకత్వంలో సినిమాల కోసం, టీవీ కోసం యాక్ట్ చేశాడు. అంతటితో ఊరుకోక తానే సొంత నిర్మాణ సంస్థ- ఫిల్మ్ వాలాస్- స్థాపించి శ్యామ్ బెనగళ్ (కలియుగ్, జునూన్), గోవింద్ నిహలాని (విజేత), అపర్ణా సేన్ (36 చౌరంగీ లేన్) వంటి పారలల్ దర్శకులతో పారలల్ సినిమాలు తీశాడు. డబ్బు సంపాదించడం ఉద్దేశం కానే కాదు. చిన్న ఫ్రేమ్... చిన్న షాట్.. చిన్న డైలాగ్... ఒక నటుడి ఆకలి తీర్చేది. ప్రయోగాలకు వెనుకాడలేదు. గిరిష్ కర్నాడ్ దర్శకత్వంలో ‘ఉత్సవ్’... శశి కపూర్ ఏదో అనుకుని తీశాడు. దేశం మరేదో అనుకుని చూసింది. పెద్ద హిట్. వెంట వైఫల్యం లేకపోతే మజా ఏముంది? ‘అజూబా’ తీశాడు. ముక్కు కాలింది. మంచిదే. హిందీ సినిమాల్లో రొమాంటిక్ హీరో అంటే దేవ్ ఆనంద్. తర్వాత? శశి కపూర్. అందరు హీరోయిన్లు ఆయన పక్కన నటించడానికి ఇష్టపడ్డారు. సాధన, ముంతాజ్, మౌసమీ చటర్జీ, జీనత్ అమాన్, హేమమాలిని... ఆ సినిమాలూ ఆ పాటలూ జనం మెచ్చారు. శశికపూర్ ఖాతాలో చాలా హిట్ పాటలున్నాయి. లిస్టు రాస్తే వేళ్లు నొప్పి పుడతాయి. హమ్ చేస్తే అంటుకుని వెంట బడతాయి. ‘పర్ దేశియోంసే న అఖియా మిలానా’ (జబ్ జబ్ ఫూల్ ఖిలే) ‘తుమ్ బిన్ జావూ కహా’ (ప్యార్ కా మౌసమ్) ‘లిఖ్ఖే జో ఖత్ తుఝే’ (కన్యాదాన్) ‘వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్’ (ఆ.. గలే లగ్‌జా) ‘ఏక్ డాల్ పర్ తోతా బోలే’ (చోర్ మచాయే షోర్) ‘కెహదూ తుమ్హే యా చుప్ రహూ’ (దీవార్) షారూక్‌ఖాన్ చాలా రుణపడి ఉన్నాడు శశికపూర్‌కి. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ టైటిల్ శశికపూర్ యాక్ట్ చేసిన ‘చోర్ మచాయే షోర్’ సినిమా పాటలోనిదే. ఇటీవల వచ్చిన ‘జానే తూ యా జానేనా’... హిట్ సినిమా కూడా శశికపూర్ పాటే. ఇంకా వేయి పాటలు ఉండవచ్చు. కాని శశికపూర్ అంటే ఒకే పాట... ఒకటే జ్ఞాపకం... ఖిల్ తే హై గుల్ యహా.. ఖిల్ కే బిఖర్ నే కో... దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన సందర్భంగా ఈ అందమైన నటుడికో గులాబీ పూమాల. - ఖదీర్ -
అమితాబ్‌తో కలిస్తే హిట్టే!
వాడిపోవడానికి అతను పుట్టింది మహా వృక్షం నీడలోకాదు.. వృక్షానికి తోడుగా.. ఊడలా! ఆ తోడులో నేర్చిన పాఠాలతో మళ్లీ తానే ఓ నటవృక్షంగా ఎదిగేంతలా! భారతీయ సినిమాకు మూల పురుషులు, పురుడు పోసిన మహానుభావులు ఎందరెందరో ఉన్నా బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ పుట్టింది మాత్రం ఫృథ్వీరాజ్ కపూర్ ఇంట్లోనే! అయితే ఆ ఘనత రాజ్ కపూర్ స్టార్‌డమ్‌తోనే ముగిసిపోలేదని రుజువు చేశాడు మరో స్టార్‌గా ఎదిగిన శశి కపూర్! తండ్రి, సోదరుడిలాగే నటనను మాత్రమే శ్వాసించిన శశి.. సోలో హీరోగా కంటే ఎక్కువగా మల్టీస్టార్ సినిమాల్లో నటించారు. అనారోగ్యం నుంచి కోలుకుని 2015, మార్చి 18న 77వ పుట్టినరోజు వేడుక జరుపుకొన్న రాజ్ కపూర్.. వారం తిరగక ముందే మరో తీపి కబురు రుచిచూశాడు. తండ్రి, సోదరుడు సొంతం చేసుకున్న ఘనతను తాను కూడా సాధించి బాలీవుడ్‌కు కపూర్ కుటుంబం అందించిన సేవలను, తద్వారా లభించిన ప్రతిష్టను మరోసారి గుర్తుచేశాడు. 2014 సంత్సరపు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్న ఆయన అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసును కొల్లగొట్టినవే! నమక్ హలాల్, దీవార్, ఇమ్మాన్ ధరం, కాలా పత్తర్, త్రిశూల్ రోటీ కపడా ఔర్ మకాన్, సుహాగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడన్ని హిట్లిచ్చారు శశీ, అమితాబ్! -
వెండి తెరపై జయరాజసం
బాలీవుడ్లో మన ‘జయ’కేతనాన్ని ఎగురవేసిన తొలితరం నటుడు. భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తెలుగుసినీప్రముఖుడు కూడా ఆయనే. కరీంనగర్ బిడ్డ అయిన పైడి జయరాజ్ చదువు సంధ్యలు సాగింది హైదరాబాద్‌లోనే. నాటి హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో 1909 సెప్టెంబర్ 28న జయరాజ్ జన్మించారు. ఆయన చదువు సంధ్యలన్నీ హైదరాబాద్‌లోనే సాగాయి. నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ చదువుకున్నారు. టాకీలు ఇంకా ప్రారంభం కాని ఆ కాలంలోనే ఆయనకు సినిమాలపై మక్కువ ఏర్పడి, 1929లో బాంబే చేరుకున్నారు. మూకీ సినిమా ‘స్టార్ క్లింగ్ యూత్’ ఆయన తొలిచిత్రం. ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహా సాగర్ మోతీ’, ‘ఫ్లైట్ ఇన్టు డెత్’, ‘మై హీరో’ వంటి పదకొండు మూకీ సినిమాల్లో జయరాజ్ నటించారు. 1931లో ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన ‘షికారీ’ ఆయన తొలి టాకీ చిత్రం. అక్కడి నుంచి జయరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాటి నట దిగ్గజాలు పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్, మోతీలాల్ వంటి వారికి దీటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు యాక్షన్ హీరోగా బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారు. నిరూపా రాయ్, శోభనా సమర్థ్, షకీలా, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, చాంద్ ఉస్మానీ, జేబున్నీసా, ఖుర్షీద్ వంటి హీరోయిన్ల సరసన ఆయన నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. చారిత్రక పాత్రలతో చెరగని ముద్ర మంచి శరీర దారుఢ్యానికి స్ఫురద్రూపం తోడవడంతో చారిత్రక పాత్రల్లో జయరాజ్ అద్భుతంగా రాణించగలిగారు. రూప దారుఢ్యాలకు మించి అద్భుతమైన అభినయంతో చారిత్రక పాత్రలతో ఆయన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. రాజ్పుటానీ, షాజహాన్, అమర్‌సింగ్ రాథోడ్, వీర్ దుర్గాదాస్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణాప్రతాప్, టిప్పు సుల్తాన్, రజియా సుల్తానా, అల్లావుద్దీన్, జై చిత్తోడ్, రాణా హమీర్ వంటి పాత్రలు ఆయనను తిరుగులేని యాక్షన్ హీరోగా నిలిపాయి. అదేకాలంలో మజ్దూర్, షేర్దిల్ ఔరత్, జీవన్ నాటక్, తూఫానీ ఖజానా, మధుర్ మిలన్, ప్రభాత్, మాలా, స్వామి, నయీ దునియా, నయీ కహానీ, హమారీ బాత్, ప్రేమ్ సంగీత్ వంటి సాంఘిక చిత్రాల్లోనూ రాణించారు. మొహర్, మాలా (1943), ప్రతిమా, రాజ్‌ఘర్, సాగర్ (1951) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సాగర్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. వయసు మళ్లిన తర్వాత కేరక్టర్ యాక్టర్‌గా పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షోలే, ముకద్దర్ కా సికందర్, డాన్, ఫిఫ్టీ ఫిఫ్టీ వంటి బ్లాక్‌బస్టర్స్‌లో కీలక పాత్రలు ధరించారు. ‘గాడ్ అండ్ గన్’ ఆయన చివరి చిత్రం. తెలుగువాడైన జయరాజ్ హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించినా, ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. తెలుగు సినీరంగం సైతం ఆయనను పట్టించుకోకపోవడమే విషాదం. అయితే భారత సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1980లో పద్మభూషణ్ అవార్డునిచ్చింది. అదే ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా జయరాజ్‌ను వరించింది. చరమాంకం విషాదకరం దాదాపు ఆరున్నర దశాబ్దాల నట జీవితాన్ని విజయవంతంగా గడిపిన జయరాజ్‌కు చరమాంకం మాత్రం విషాదమే. పంజాబీ మహిళ సావిత్రిని పెళ్లాడిన ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తి కోసం కొడుకు దిలీప్‌రాజ్ వేధింపులకు దిగడంతో భరించలేక వార్ధక్యంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సొంత ఫ్లాట్‌పై జయరాజ్‌కే అధికారం ఉంటుందని, కొడుకు దిలీప్ రాజ్ రోజుకు ఒకసారి చూసిపోవడం తప్ప అక్కడ ఉండేందుకు వీలులేదని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జయరాజ్ ఎన్నాళ్లో బతకలేదు. 2000 ఆగస్టు 11న తుదిశ్వాస విడిచారు. - పన్యాల జగన్నాథదాసు -
గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
-
గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
ప్రముఖ సినీ గేయ రచయిత గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. దర్శకుడి, నిర్మాత, రచయిత, కథనం తదితర రంగాలలో భారతీయ సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా గుల్జార్‌ను ఆ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. భారతీయ సినిమా పురోగతికి విశేషమైన సేవలు అందించారని గుల్జార్‌ను ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. 45వ దాదాపాల్కే అవార్డును త్వరలో కేంద్ర ప్రభుత్వం గుల్జార్‌కు అందజేయనుంది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కర్లా.