
న్యూఢిల్లీ: సినీరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్న నేపథ్యంలో.. తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ తన భావోద్వేగాలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న నా తండ్రికి శుభాకాంక్షలు.
'నాకు మీరే స్ఫూర్తి అంటూనే మై హీరో.. కంగ్రాచ్యులేషన్స్ పా.. వీ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు' అంటూ వ్యాఖ్యానించారు. ఇక అమితాబ్ కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అవార్డు అందుకున్నప్పటి ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 23న జరిగింది. అయితే, అనారోగ్యం కారణంగా తాను రాలేకపోతున్నట్లు అమితాబ్ ముందుగా నిర్వాహకులకు చెప్పడంతో.. ఆదివారం ప్రత్యేకంగా ఈ అవార్డును రాష్టపతి ఆయనకు అందించారు.
T 3592/3/4/5 - .. my immense gratitude and respect for this moment ..🙏 pic.twitter.com/WavW3Hwkjw
— Amitabh Bachchan (@SrBachchan) December 29, 2019