అభిషేక్ బచ్చన్
సోషల్ మీడియాలో నెటిజన్లు చాలాసార్లు ఇష్టానుసారం కామెంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు మంచి కారణాలను కూడా ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఇదే అనుభవం తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌కు ఎదురైంది. ఇంత వయస్సొచ్చినా అభిషేక్ ఇంకా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడనే అర్థంలో ఆయనను ఎద్దేవా చేస్తూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీ జీవితం గురించి అస్సలు బాధ పడకండి. అభిషేక్ బచ్చన్ చూడండి. ఇంకా అమ్మానాన్నలతోనే కలిసి ఉంటున్నాడు..’ అంటూ చేసిన ఈ కామెంట్‌కు అభిషేక్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. ‘అవును. వారితో కలిసి ఉన్నందుకు, వారు నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నువ్వు కూడా అలా ఉండేందుకు ప్రయత్నించు. అప్పుడైనా నిన్ను నువ్వు మంచిగా భావించుకునే అవకాశముంది’ అని కౌంటర్ ఇచ్చాడు.
ఆసక్తికరంగా ఇటీవల డేవిడ్ లెటర్‌మ్యాన్ లేట్‌నైట్ టాక్‌షోలో పాల్గొన్న ఐశ్యర్యరాయ్ బచ్చన్ ఇదే తరహాలో సమాధానమిచ్చారు. మీరు తల్లిదండ్రులతో కలిసి ఉంటారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘తల్లిదండ్రులతో కలిసి ఉండటం బాగుంటుంది. తల్లిదండ్రులతో డిన్నర్ చేసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకునే సంస్కృతి భారత్‌లో లేదు’అని ఐశ్వర్య బదులిచ్చింది. ఇప్పుడు అభిషేక్ కూడా తన తల్లిదండ్రులతో కలిసి ఉండటం, వృద్ధాప్యంలోని వారిని శ్రద్ధగా చూసుకోవడంతో తనకెంతో గర్వకారణమని చెప్పడం నెటిజన్లను కదిలిస్తోంది. తల్లిదండ్రులను చూసుకునే విషయంలో అభిషేక్, ఐశ్వర్య ఆదర్శప్రాయమని, ఈ విషయంలో అభిషేక్ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నెటిజన్లు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అభిషేక్‌కు అనుకూలంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
Yes! And it’s the proudest moment for me to be able to be there for them, as they have for me. Try it sometime, you might feel better about yourself.
— Abhishek Bachchan (@juniorbachchan) April 17, 2018
Comments
Please login to add a commentAdd a comment