
నడవలేని స్థితిలో ఉన్నా! రాలేను..!!
2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం ప్రసిద్ధ హిందీ నటుడు శశికపూర్‌ను వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారానికి శశికపూర్ పూర్తి అర్హుడు అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే పురస్కారాన్ని స్వయంగా వెళ్లి, స్వీకరించే పరిస్థితిలో శశికపూర్ లేరు. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌కి పరిమితమైన తాను వచ్చే నెలలో జరగబోయే అవార్డు వేడుకకు హాజరు కాలేననీ, అందుకు తనను క్షమించమనీ శశికపూర్ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చరిత్రలో ఇలా జరగడం రెండో సారి. 2012 సంవత్సరానికి బాలీవుడు విలన్ ప్రాణ్‌కు ఈ అవార్డు వరించింది. ఆయన కూడా నడవలేని స్థితిలో ఉండటంతో ఈ అవార్దును ఆయన స్వగృహంలో అందజేశారు.