
ముంబయి : అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ (79) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న శశికపూర్ నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. కబీ కబీ, దుస్‌రా ఆద్మీ, జమీన్ ఆస్మాన్ లాంటి పలు హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అమితాబ్‌తో కలిసి శశికపూర్ దివార్, నమక్ హలాల్ చిత్రాల్లో నటించారు.
ప్రతిష్టాత్మక పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కెతో పాటు ఎన్నో అవార్డులను శశికపూర్ అందుకున్నారు. ఆగ్ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. శశికపూర్ హీరోగా నటించిన తొలి చిత్రం ధర్మపుత్ర. ఆయన చివరి చిత్రం సైడ్ స్ట్రీట్స్ (1999). పాతతరం కథానాయకుడు పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడే శశికపూర్. మరోవైపు శశికపూర్ మృతి పట్ల బాలీవుడ్ విషాదంలో ముగినిపోయింది. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సంతాపం తెలిపారు.




Comments
Please login to add a commentAdd a comment