పైడి జైరాజ్ చరిత్ర తెలియచేయాలి
తెలంగాణ తొలి కథానాయకుడు, దర్శక-నిర్మాత పైడి జైరాజ్ నిజాం కాలంలోనే ముంబై వెళ్లి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి పేరు తెలుగు సినిమా చరిత్రలో వినిపించడం లేదు. ఆయన చరిత్ర ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు.
పైడి జైరాజ్ 107వ జయంతిని ఫిలించాంబర్‌లో నిర్వహించారు. ‘‘జైరాజ్ వంటి గొప్ప వ్యక్తి చరిత్రను తెలుగు చిత్ర పరిశ్రమ వారు పట్టించుకోవడం లేదు. ఫిలింనగర్‌లో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అని దర్శకుడు బాబ్జీ అన్నారు